ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీపై మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయి: పవార్​ - తెలుగు జాతీయం వార్తలు

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై దిల్లీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ స్పందించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు.

Surprised over Modi's NRC comments: Pawar
మోదీ ఎన్​ఆర్​సీ వ్యాఖ్యలకు నేను ఆశ్చర్యపోయా: పవార్​
author img

By

Published : Dec 23, 2019, 7:12 PM IST

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై మోదీ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​​. గతంలో ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై పార్లమెంటులో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రస్తావించారని పవార్​ గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా కూడా ఎన్​ఆర్​సీపై రాజ్యసభలో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

ప్రతి ఆడుగులోనూ భాజపా ప్రభుత్వం విఫలమైనట్లుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి ప్రజల దారి మరల్చేందుకు చూస్తున్నారు. అంతకు మించి వారి ప్రసంగంలో ఇంకేం కనిపించలేదు.

శరద్ పవార్​, ఎన్​సీపీ అధినేత

ఆదివారం దిల్లీలోని రామ్​లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో.. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు ప్రతిపాదనపై చర్చించలేదని మోదీ వ్యాఖ్యానించారు. సుప్రీం ఆదేశాల మేరకు ఒక్క అసోంలో మాత్రమే ఎన్​ఆర్​సీని అమలు చేసినట్లు ప్రధాని తెలిపారు.

ఝార్ఖండ్​ ఫలితాలే నిదర్శనం..

మరోవైపు ఝార్ఖండ్​ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవార్... భాజపాకు ప్రజలు గట్టిగా సమాధానం ఇచ్చారని అభిప్రాయపడ్డారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఝార్ఖండ్​లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇది ఆదివాసీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. పేదరికం అధికం. ఇలాంటి పరిస్థితుల్లో భాజపా అధికారం చేజిక్కించుకోవడం కోసం ధన బలం చూపేందుకు ప్రయత్నించింది. కానీ ఝార్ఖండ్​ ప్రజలు దాన్ని స్వీకరించలేదు. అందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా.

శరద్​ పవార్​, ఎన్​సీపీ అధినేత

ఏడాది వ్యవధిలోనే ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, మహారాష్ట్రతో పాటు తాజాగా ఝార్ఖండ్​లోనూ భాజపాకు ఓటమి ఎదురైంది. భాజపా పతనం మొదలైందనడానికి ఇదే నిదర్శనమని శరద్​ పవార్​ అన్నారు.

ఇదీ చూడండి: 'పౌరసత్వం పేరుతో భారతీయులను వేధించం'

Patna (Bihar), Dec 23 (ANI): An organisation called 'Bharat Bachao Morcha' hit the road in Bihar's Patna to counter ongoing protests against the Citizenship Amendment Act and NRC. Security was also beefed up across the rally. Speaking to ANI, a protester said, "The bill does no harm to the citizens of India." President Ram Nath Kovind gave his assent to the Citizenship Amendment Bill (CAB) on December 13 which sought to give Indian citizenship to non-Muslim immigrants who faced persecution in three neighbouring countries - Pakistan, Bangladesh and Afghanistan.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.