యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానానికి తాను దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. బీఎస్ఎఫ్ మాజీ జవాన్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు నవంబరు 18న తీర్పును రిజర్వు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. తాజాగా పిటిషన్ తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.
2017లో తమకిచ్చే ఆహారంలో నాణ్యత లేదని వీడియో విడుదల చేసినందుకు గానూ జవాన్ తేజ్ బహదూర్‌ను తొలగించింది బీఎస్ఎఫ్. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసిలో పోటీకి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు తేజ్ బహుదూర్. ఆ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంటూ గతేడాది మే 1న తిరస్కరించారు.
రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని తేజ్ బహదూర్ సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా.. అలాహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్నే దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
ఇదీ చదవండి: 'చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోయింది అందుకే'