ETV Bharat / bharat

అజీమ్​ ప్రేమ్​జీపై ట్రయల్​ కోర్టు విచారణపై సుప్రీం స్టే

ప్రముఖ వ్యాపారవేత్త, విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీపై అవినీతి ఆరోపణల కేసులో ట్రయల్​ కోర్టు విచారణపై స్టే విధించింది సుప్రీం కోర్టు. కేసులో భాగంగా నోటీసులు జారీ చేసింది.

Criminal Proceedings Against Azim Premji
అజీమ్​ ప్రేమ్​జీపై విచారణపై సుప్రీం స్టే
author img

By

Published : Dec 18, 2020, 6:47 PM IST

విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీ, ఆయన భార్యపై నమోదైన కేసులో ట్రయల్​ కోర్టు విచారణపై స్టే విధించింది సుప్రీం కోర్టు. గత జనవరిలో అదనపు సిటీ సివిల్​, సెషన్స్​ కోర్టు జారీ చేసిన తాఖీదులను సవాల్​ చేస్తూ ప్రేమ్​జీ దాఖలు చేసిన పిటిషన్​పై నోటీసులు జారీ చేసింది.

అజీమ్​ ప్రేమ్​జీ పిటిషన్​పై జస్టిస్​ సంజయ్​ కిషన్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్​ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ.. ఇదో వింత కేసు అని పేర్కొన్నారు. ప్రేమ్​జీ, ఆయన తల్లికి చెందిన మూడు సంస్థలు.. ఆయనకు చెందిన నాలుగో సంస్థ 'హషామ్​' లోనే వీలినమైనట్లు కోర్టుకు తెలియజేశారు. ఈ సందర్భంగా.. ఈ విలీన పథకానికి వెలుపల ఏమైనా ఆరోపణలు ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించగా.. విలీనం పరిధిలోనే ఉన్నట్లు చెప్పారు సింఘ్వీ. ఈ క్రమంలో.. విప్రో సంస్థకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. అలాగే.. ట్రయల్​ కోర్టులో విచారణపైనా స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కేసు ఏమిటి?

కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థతో పాటు ప్రైవేటు ట్రస్టులోకి పాత మూడు సంస్థల నుంచి అక్రమంగా భారీగా నిధులు మళ్లించారనే ఆరోపణలతో చెన్నైకి చెందిన 'ఇండియా అవేక్​ ఫర్​ ట్రాన్స్​పరెన్సీ' అనే ఓ ప్రవేటు ఎన్​జీఓ.. ట్రయల్​ కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై జనవరి 27న అజీమ్​ ప్రేమ్​జీ, ఆయన భార్యతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది కోర్టు. ఈ తాఖీదులను సవాల్​ చేస్తూ కర్ణాటక హైకోర్టును అజీమ్​ ప్రేమ్​జీ ఆశ్రయించగా.. వారి పిటిషన్​ను కొట్టివేసింది హైకోర్టు. అనంతరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు ప్రేమ్​జీ.

ఇదీ చూడండి: దాతృత్వంలో అజీమ్ ప్రేమ్​జీదే అగ్రస్థానం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.