ETV Bharat / bharat

నీట్​, జేఈఈపై 6 రాష్ట్రాల మంత్రుల పిటిషన్​ తిరస్కరణ

Supreme Court refuses to entertain the review petition filed by ministers of six states
నీట్​, జేఈఈపై 6 రాష్ట్రాల మంత్రుల పిటిషన్​ తిరస్కరణ
author img

By

Published : Sep 4, 2020, 3:06 PM IST

Updated : Sep 4, 2020, 3:36 PM IST

15:28 September 04

జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని భాజాపాయేతర పార్టీల పాలనలోని 6 రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.  పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని, ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ.. ఆరు రాష్ట్రాల మంత్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పు విద్యార్థుల జీవించే హక్కును హరిస్తోందని.. కరోనా వేళ పరీక్షల నిర్వహణతో వచ్చే ఇబ్బందులను విస్మరిస్తోందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను బంగాల్ నుంచి​ మొలోయ్​ ఘటక్​, ఝార్ఖండ్ నుంచి​ రామేశ్వర్​ ఓరావున్, రాజస్థాన్ నుంచి​ రఘు శర్మ, ఛత్తీస్​గఢ్​ నుంచి అమర్​జీత్​ భగత్​, పంజాబ్ నుంచి​ బీఎస్​ సిద్ధు, మహారాష్ట్ర నుంచి ఉదయ్​ రవీంద్ర సావంత్​ దాఖలు చేశారు.

నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్​టీఏ) నీట్​, జేఈఈ పరీక్షలను నిర్వహిస్తోంది. జేఈఈ మేయిన్​ పరీక్షలను సెప్టెంబర్​ 1 నుంచి 6 వరకు, నీట్​ పరీక్షలను సెప్టెంబర్​ 13న నిర్వహిస్తోంది.

15:02 September 04

నీట్​, జేఈఈపై 6 రాష్ట్రాల మంత్రుల పిటిషన్​ తిరస్కరణ

నీట్, జేఈఈ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ఆరు రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Last Updated : Sep 4, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.