ETV Bharat / bharat

కూల్​డ్రింక్​లపై వ్యాజ్యం​.. రూ.5 లక్షల జరిమానా

author img

By

Published : Jun 12, 2020, 1:34 PM IST

శీతలపానీయాల అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన ఓ సామాజిక కార్యకర్తకు ఎదురుదెబ్బ తగిలింది. వ్యాజ్యం​ కొట్టివేసిన న్యాయస్థానం రూ.5 లక్షల జరిమానా విధించింది.

supreme court of india
సుప్రీంకోర్టు

కోకో కోలా, థమ్స్​ అప్​ వంటి శీతలపానీయాలు ఆరోగ్యానికి హానికరమని.. వాటిపై నిషేధం విధించాలని పిల్​ వేసిన ఓ సామాజిక కార్యకర్తకు మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అతడి వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కోర్టు విలువైన సమయాన్ని అసంబద్ధ సమాచారం కలిగిన వ్యాజ్యాలతో వృథా చేశారని రూ.5 లక్షల జరిమానా విధించింది.

జస్టిస్​ డీ.వై. చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

"పిటిషనర్​కు సాంకేతిక అంశాలపై ఎలాంటి అవగాహన లేకుండా వ్యాజ్యం దాఖలు చేశారు. ఎందుకు రెండు బ్రాండ్​లపైనే పిల్​ వేశారనే దానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది వ్యాజ్యాన్ని తప్పుదోవపట్టించడమే. చట్టంలోని ఆర్టికల్​-32 ప్రకారం పిల్​ నిబంధనలు పాటించలేదు. కోర్టు సమయాన్ని వృథా చేసిన కారణంగా రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నాం. ఆ డబ్బును నెలరోజుల్లోగా చెల్లించాలి" - సుప్రీం ధర్మాసనం

ఇదీ చూడండి:రిజర్వేషన్​ అనేది ప్రాథమిక హక్కు కాదు: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.