గర్భవిచ్ఛిత్తిని క్రిమినల్ నేరాల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ముగ్గురు మహిళలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు అంగీకరించింది సర్వోన్నత న్యాయస్థానం. స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
ప్రసవమా, గర్భస్రావమా అనేది మహిళ ఇష్టానికి వదిలేయాలని పిటిషనర్లు కోరారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(అసహజ గర్భస్రావం) చట్టంలోని నిబంధనలు మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం తల్లికి ప్రమాదం ఉందంటేనే అబార్షన్‌కు అనుమతి లభిస్తుంది.
ఇదీ చూడండి: 'బాబ్రీ కేసు విచారణ ముగింపునకు 6 నెలలు కావాలి'