ETV Bharat / bharat

వివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి సుప్రీం షాక్‌! - జస్టిస్​ పుష్ప గనేడివాలా తీర్పులపై సుప్రీకోర్టు తీర్పు

బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన వివాదాస్పద తీర్పులపై సుప్రీంకోర్టు స్పందించింది. తీర్పులిచ్చిన మహిళా న్యాయమూర్తి జస్టిస్​ పుష్ప గనేడివాలాకు హైకోర్టులో శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. ఓ కేసులో జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

supreme-court-holds-bombay-hc-judges-confirmation
వివాదాస్పద తీర్పులు.. న్యాయమూర్తికి సుప్రీం షాక్‌!
author img

By

Published : Jan 30, 2021, 2:26 PM IST

గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాపై సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో ఆమెకు శాశ్వత హోదా కల్పించేలా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

జస్టిస్‌ పుష్ప గనేడివాలా బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్‌ బెంచ్‌లో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ బెంచ్‌కు ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా ధ్రువీకరించేందుకు జనవరి 20న సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేసింది. కాగా.. ఇటీవల మైనర్లపై లైంగిక వేధింపుల కేసుల్లో జస్టిస్‌ పుష్ప కొన్ని సంచలన తీర్పులు వెల్లడించారు.

12 ఏళ్ల బాలిక ఛాతీ భాగాన్ని ఓ వ్యక్తి తడమగా, చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్‌ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం వేధింపులుగా పేర్కొనలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.

ఆ తర్వాత అయిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ జస్టిస్‌ పుష్ప ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్‌ బాలికల చేతులు పట్టుకోవడం, వారి ముందు పురుషుడు ప్యాంటు జిప్‌ విప్పుకోవడం లైంగిక వేధింపుల కిందికి రాదని తీర్పు వెలువరించారు. వేధింపుల నుంచి బాలికలను రక్షించే పోక్సో చట్టం కింద వీటిని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేశారు. అయితే ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపాయి.

ఇటీవల అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. ఓ కేసులో జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆందోళనకరమని, భవిష్యత్తులో ఇది ప్రమాదకరమైన ఉదాహరణగా మారే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో జస్టిస్‌ పుష్ప ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఆమె శాశ్వత హోదా అంశంపై కొలీజియం సిఫార్సులను వెనక్కి తీసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి:దిల్లీ పేలుడు కేసు ఎన్​ఐఏకు అప్పగింత!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.