సుప్రీంకోర్టులో దాఖలయ్యే కేసులను వివిధ బెంచ్‌లకు కేటాయించే కొత్త రోస్టర్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విడుదల చేసింది. ఇది దాదాపు ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలైన రోస్టర్‌లాగే ఉంది. ఎలక్షన్, హెబియస్‌కార్పస్ పిటిషన్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే బెంచ్‌కే వస్తాయి.
ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసులను ప్రధాన న్యాయమూర్తితోపాటు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనాలు విచారించనున్నాయి.