అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడారు జాఫర్యాబ్ జిలానీ. ప్రజలు ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని సూచించారు. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నప్పటికీ.. అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.
"మేం తీర్పుపై సంతృప్తిగా లేము. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడే చెప్పలేము. కానీ ఒక్కటి చెప్పగలను. తీర్పులో కొన్ని అంశాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఏదేమైనా సుప్రీం కోర్టును తీర్పును మేం గౌరవిస్తున్నాం. దేశమంతా ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని మేం ప్రజలను కోరుతున్నాం."
- జాఫర్యాబ్ జిలానీ, సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది
అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్...
సుప్రీం తీర్పుపై అఖిల భారత మస్లిం పర్సనల్ లా బోర్డ్ స్పందించింది. అయోధ్య కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సమీక్షకు వెళ్లాలని నిర్ణయించింది. 5 ఎకరాల స్థలం వల్ల తమకు ఏం ఉపయోగం లేదన్నారు.
ఇదీ చూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం