అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది ఉత్తర్ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు. కోర్టు తీర్పుపై పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని తేల్చిచెప్పింది.
"అయోధ్యకేసుపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పును సవాలు చేసే ఆలోచన మాకు లేదు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నాం. అనంతరం మా అభిప్రాయాన్ని సవివరంగా ప్రకటిస్తాం. కోర్టు తీర్పును బోర్డు సవాలు చేస్తుందని ఎవరైనా ప్రకటిస్తే అది సరైన ప్రకటన కాదని భావించాలి."
-జాఫర్ అహ్మద్ ఫారూకీ, సున్నీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్
అయితే అంతకుముందు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అయోధ్య తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయని.. పునః సమీక్ష కోరతామని సున్నీ బోర్డు కార్యదర్శి జాఫర్యాబ్ జిలానీ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పునకు మార్గం చూపిన 27 ఏళ్ల నాటి చట్టం!