ETV Bharat / bharat

దేశంలో 'భాషా జాతీయవాదం' చిచ్చు! - బెళగావి మహారాష్ట్ర

కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన వివాదం రగిల్చింది. మహారాష్ట్ర-కర్ణాటక మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. బెళగావి సహా పలు ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేస్తామని ఠాక్రే పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుంటే తలెత్తే ప్రమాదాలేంటి? ఇతర రాష్ట్రాలూ తమ భాష మాట్లాడే ప్రాంతాల విషయంలోనూ కొత్త వాదనలకు తెర తీస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?

Sub-nationalism on the rise in India, but who will bell the cat?
దేశంలో 'భాషా జాతీయవాదం' చిచ్చు!
author img

By

Published : Jan 21, 2021, 1:42 PM IST

ఐకమత్యానికి, సామాజిక వైవిధ్యానికి భారతదేశం ప్రతీక. దేశంలో అన్ని వర్గాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భాషాపరమైన గుర్తింపు ఇందులో చాలా ముఖ్యమైనది. ఒకే భాష మాట్లాడే ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేలా లభించే విధంగా భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల విభజన జరిగింది. అయితే రాష్ట్రాల సరిహద్దులను నిర్వచించే సమయంలో.. మిశ్రమ జనాభా కలిగిన ప్రాంతాలు ఏదో ఒక రాష్ట్రంలోకి వెళ్లాయి. దీంతో భాషా మెజారిటీ ఉన్న రాష్ట్రానికే తమ ప్రాంతాన్ని జత చేయాలని పలు ప్రాంతాల్లో డిమాండ్లు వినిపించాయి. పలు రాష్ట్రాలు భాషా పరమైన మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకున్నాయి.

అయితే రాష్ట్రాల పునర్విభజనలో చేసిన పొరపాట్లు ఇప్పుడు ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నిద్రాణ స్థితిలో ఉన్న సమస్యలు బట్టబయలు కావడం వల్ల రాష్ట్రాల మధ్య శాంతి, సామరస్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది దేశ సమైక్యతపైనా ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కర్ణాటకలో మరాఠీవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ట్వీట్ ఈ ప్రకంపనలకు కారణమైంది. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య చిచ్చు పెట్టింది. బెళగావి సహా మరాఠీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేస్తామని ఠాక్రే ప్రకటించడమే ఇందుకు కారణం.

ఇదీ చదవండి: ఠాక్రే వ్యాఖ్యలపై కన్నడ నేతల మండిపాటు

వివాదం ఏనాటిదో..

ఈ జిల్లాపై ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి వివాదం ఉంది. బెళగావి తమ ప్రాంతమని రెండు రాష్ట్రాలు ప్రకటించుకుంటున్నాయి. బెళగావిలోని మరాఠీ ప్రజలు మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి నేతృత్వంలో ఉద్యమాన్ని కూడా నడిపించారు. ఈ ప్రాంతాన్ని మహారాష్ట్రతో కలపాలని డిమాండ్ చేశారు. అయితే, మహారాష్ట్ర వాదనను కర్ణాటక ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. బెళగావిపై తమ హక్కును సుస్థిరం చేసేందుకు ఆ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ శాసనసభ భవంతిని సైతం నిర్మిస్తోంది.

బెళగావి నగర కార్పొరేషన్​ ఎన్నికలు ఎప్పుడూ మహారాష్ట్ర ఏకీకరణ్ సమితికి కర్ణాటకలోని మిగిలిన పార్టీలకు మధ్య హోరాహోరీగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ చేసిన ట్వీట్.. ఇక్కడి స్థితిని మార్చేసింది. జిల్లాను మహారాష్ట్రలో కలిపేయాలనే ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని శివసేన భావిస్తోంది. శివసేన రాజకీయాలు భాషాపర అభిమానం, హిందుత్వ భావజాలంతో ముడిపడి ఉంటాయి. కానీ, కర్ణాటకలోనూ భాషాభిమానం తక్కువేం కాదు.

ఆ రాష్ట్రాలు ప్రశ్నిస్తే?

రాష్ట్రాల సరిహద్దుల విధానంపై భిన్నాభిప్రాయాలకు బెళగావి తాజా ఉదాహరణ మాత్రమే. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుంటే ఎలాంటి ప్రమాదకరమైన పరిణామాలు తలెత్తుతాయన్నదే ఆందోళనకరంగా మారింది.

నేటి భాషా రాష్ట్రాలు కేవలం జాతి, మతం, మాట్లాడే భాష ఆధారంగా ఏర్పడలేదు. ఒకవేళ బెళగావిపై మహారాష్ట్ర వాదనతో ఏకీభవిస్తే.. అంతటితో విషయం ఆగిపోదు. వారి తర్వాతి లక్ష్యం గోవాపై ఉంటుంది. గోవా రాష్ట్రం మొత్తం తమదే అని మహారాష్ట్ర అంటుంది. కేరళలోని కాసర్​గోడ్ జిల్లా ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలోని కెనరా జిల్లాలో ఉండేది. కన్యాకుమారి గతంలో ట్రావెన్​కోర్ సంస్థానంలో ఉండేది. మార్తాండం, నాగెర్​కోయిల్ సైతం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. చారిత్రక నేపథ్యాన్ని బట్టి వీటన్నింటిపై తమదే హక్కు అని కేరళ కూడా వాదన మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాల్లో తలెత్తవచ్చు. ఇది దేశాన్నే అస్థిరంగా మార్చేస్తుంది.

సమైఖ్య భావన చెక్కుచెదరదు

ఒక దేశాన్ని ఏ కోణంలో చూస్తారనే విషయాన్ని నిశితంగా గమనిస్తే ఈ సమస్యకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. బెనెడిక్ట్ అండర్సన్ అనే రాజకీయ శాస్త్రవేత్త.. దేశాలను ఊహాజనిత సమాజాలుగా అభివర్ణించారు. ఆయన సిద్ధాంతం ప్రకారం భారతదేశం కూడా ఈ కోవలోకే వస్తుంది. విభిన్న సమాజాలను ఒక్కచోట కలిపే సంస్కృతి, చారిత్రక నేపథ్యం మన దేశంలో పూర్వీకుల నుంచి వచ్చింది. కానీ, ఆధునిక భారతదేశంలో భాషా ప్రాతిపాదికతో కూడిన ఉప-జాతీయవాదం చరిత్రకు సవాళ్లు విసురుతోంది.

కానీ, దేశంలోని జనాభా వైవిధ్యంగా మారిపోతోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ మార్పు వేగంగా జరుగుతోంది. బెళగావి సైతం ఇదే దిశగా పయనిస్తోంది. ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయ స్వప్రయోజనాలతో కూడినవే కాబట్టి వాటిని పక్కనబెట్టేయవచ్చు. అయితే, భాషాపరమైన మైనారిటీలు ఉన్న రాష్ట్రాలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వారికి సరైన గుర్తింపు ఇవ్వడం, పాలనాయంత్రాంగాల్లో ప్రాతినిధ్యం కల్పించడం వంటివి చేపట్టాలి. భాషా దురాభిమానం మాటున భారతదేశం తన సమైఖ్య భావనను కోల్పోయే ప్రసక్తే లేదు. అదే సమయంలో భాషాపరమైన జనాభా గుర్తింపును ఎవరు మార్చలేరు. ఒక పరిపూర్ణమైన దేశం ఈ రెండింటినీ ఎప్పటికీ నిలబెట్టుకుంటుంది.

(రచయిత-వర్గీస్ అబ్రహం, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్- ఈటీవీ భారత్)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.