ETV Bharat / bharat

'కోట' నుంచి స్వరాష్ట్రాలకు విద్యార్థులు - lockdown latest news

లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్ లోని కోట ప్రాతంలో చిక్కుకున్న పలు రాష్ట్రాల విద్యార్థలు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. షరతులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అస్సోంకు చెందిన 391 మంది సొంత ఊళ్లకు చేరుకున్నారు. తెలుగు విద్యార్థులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. తెలుగు విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేరుస్తామని లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా హామీ ఇచ్చారు.

Kota
సొంత ఊళ్లకు బయలుదేరిన విద్యార్థలు
author img

By

Published : Apr 27, 2020, 7:50 AM IST

Updated : Apr 27, 2020, 8:07 AM IST

లాక్ డౌన్ నేపథ్యంలో రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అసోంకు చెందిన 391 మంది విద్యార్థులు తమ ఊళ్లకు చేరుకున్నారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. స్వస్థలాలకు రావటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు విద్యార్థులు. రాజస్థాన్ ప్రభుత్వం తమకు అన్ని ఏర్పాట్లు చేసిందని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Kota
సొంత ఊళ్లకు బయలుదేరిన విద్యార్థలు

రాష్ట్రాల అంగీకారంతో..

విద్యార్థులను వారి స్వస్థలాకు అనుమతించేందుకు సంబంధిత రాష్ట్రాలు అంగీకరించిన నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వారిని పంపించేందుకు అనుమతి ఇచ్చారు. వారిని పంపే ముందు తప్పనిసరిగా స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశించారు. అలాగే తమ ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

బిహార్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

లోక్‌సభ స్పీకర్‌తో ఉపరాష్ట్రపతి చర్చ

రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఎలా ఉన్నారని తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. స్థానిక ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతో ఆయన ఆదివారం పలు దఫాలు ఫోన్‌లో మాట్లాడారు. తెలుగు విద్యార్థుల ఇబ్బందులపై 'ఈనాడు'లో వచ్చిన కథనాన్ని తర్జుమా చేయించి స్పీకర్‌కు పంపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంపై సభాపతితో చర్చించారు. వారి భోజన, వైద్య సంబంధిత ఏర్పాట్లు చేస్తామని, వ్యక్తిగత చొరవ చూపుతానని ఓం బిర్లా హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ తర్వాత పరిస్థితిపై కేంద్రం ప్లాన్స్ ఇవే..

Last Updated : Apr 27, 2020, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.