ETV Bharat / bharat

ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్​ అయిన బాలిక!

కరోనా దెబ్బతో ఆన్​లైన్​ విద్యకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అలాంటి సౌకర్యాలు అందుబాటులో లేని పేద పిల్లలకు విద్యనందించేందుకు ఓ విద్యార్థిని.. ఉపాధ్యాయురాలిగా అవరతారమెత్తింది. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక.. తన స్వగ్రామంలోని పిల్లలకు పాఠ్యాంశాలు బోధిస్తూ ఔరా అనిపిస్తోంది.

Student turns her house into a classroom to teach the children in her village, Kerala
ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్​ అయిన బాలిక!
author img

By

Published : Oct 14, 2020, 8:41 PM IST

Updated : Oct 14, 2020, 9:36 PM IST

ఔరా అనామిక: ఎనిమిదో తరగతిలోనే టీచర్​ అయిన బాలిక!

తమిళనాడు-కేరళ సరిహద్దులోని పాలక్కడ్ జిల్లాలో అదొక గిరిజన గ్రామం. ఆన్​లైన్​ విద్యకు ప్రాధాన్యం ఏర్పడటం వల్ల.. అక్కడి విద్యార్థులకు సౌకర్యాలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే తన ఊరి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన అనామిక.. తానే ఉపాధ్యాయురాలిగా మారింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులూ ఆమెకు అండగా నిలవడం వల్ల.. వాళ్ల ఇంట్లోని ఓ గదిని విద్యాలయంగా మార్చి అక్కడే పేద పిల్లలకు విద్యనందిస్తోంది.

త్రివేండ్రంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది అనామిక. జర్మన్​, మలయాళం, తమిళం, ఇంగ్లీష్​ భాషలను నేర్చుకుంటోంది. అయితే.. తన గ్రామ బాగోగులపై దృష్టి సారించిన ఈ బాలిక.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పిల్లలకు పాఠాలు చెబుతోంది.

దినసరి కూలీగా పనిచేస్తున్న అనామిక తల్లిదండ్రులు.. తమ కూతురు ఇలా పాఠాలు బోధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆన్​లైన్​ తరగతులకు అనామిక హాజరుకాలేకపోవడం తమకేం బాధ కల్పించలేదన్న వారు.. ఆమె వల్ల సుమారు 15 మంది ప్రయోజకులవడం సంతోషాన్నిస్తుందన్నారు.

ఇదీ చదవండి: రెండేళ్లకే అంకెలతో ఆడేసుకుంటున్న బుడతడు

Last Updated : Oct 14, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.