ETV Bharat / bharat

కరోనా వేళ.. ఉత్తర భారతానికి మరో ముప్పు! - పంట మొదళ్లను తగులబెట్టడం వల్ల ప్రమాదాలు

దేశంలో కరోనా కోరలు చాస్తోన్న వేళ.. ఉత్తర భారత ప్రజలకు మరో ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హరియాణా, పంజాబ్​లో పంట మొదళ్లను కాల్చివేయడం వల్లే.. ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్య స్థాయిలు.. కరోనా వ్యాధిగ్రస్తులకు మరింత ప్రమాదకరమంటున్నారు నిపుణులు.

Stubble Burning Can Exacerbate Corona virus Crisis
కరోనా వేళ ఉత్తర భారతానికి మరో ముప్పు
author img

By

Published : Sep 21, 2020, 5:50 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ఉత్తర భారతీయులకు మరో ముప్పు పొంచి ఉంది. హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం తాజా పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశాలున్నాయని వాతావరణ, వ్వవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపే కొవిడ్​ బాధితులకు ఇది మరింత ప్రమాదకరంగా మారొచ్చని అంటున్నారు.

పెరుగుతున్న విషవాయువులు

చలికాలం ప్రారంభ సమయంలో పంట మొదళ్లను తగలబెట్టే పని ఓ సమస్యగా మారింది. వీటివల్ల ఏర్పడే కాలుష్యంతో దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తర భారత దేశమంతా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా గాలి కాలుష్య కారకాలైన పీఎం స్థాయిలతో పాటు కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీంతో వాతావరణంలో కాలుష్య స్థాయి 18 నుంచి 40శాతం పెరుగుదలకు ఈ పంటల దహన ప్రక్రియ కారణమవుతున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి.

దిల్లీలో పెరిగే వాయుకాలుష్యానికి ఈ రెండు రాష్ట్రాల్లో పంట మొదళ్లు దహనం చేయడమేనని నిపుణులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్‌ వ్యవసాయ నిర్వహణ సలహాదారుగా ఉన్న సంజీవ్‌ నాగ్‌పాల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. పంట మొదళ్లను కాల్చడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

తగ్గిపోతున్న సిలికాన్​

తీవ్ర శ్వాసకోస సమస్యలకు కారణమయ్యే ఈ చర్యలు తాజాగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణకు మరింత ఆజ్యం పోసే అవకాశాలున్నట్లు నిపుణులు భావించారు. 'పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల నేలలో ఉండే సిలికాన్‌ తగ్గిపోతుంది. తద్వారా మానవుల రోగనిరోధక శక్తికి దోహదం చేసే సిలికాన్​ స్థాయి శరీరంలో మరింత పడిపోతోంది. దీంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా కొవిడ్‌తో సతమతమవుతోన్న వేళ ఈ చర్యలు మరింత విషమంగా మారే అవకాశాలున్నాయి.' అని సంజీవ్‌ నాగ్‌పాల్ పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని పంట మొదళ్లను కాల్చే ప్రక్రియను తగ్గించడం సహా.. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కృషిచేయాలని పర్యావరణ నిపుణులు సూచించారు.

దిల్లీలో పెరిగిన కాలుష్యం

పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలో చేపట్టే ఈ పంట మొదళ్లను కాల్చే చర్యలతో దిల్లీలో 44శాతం వాయుకాలుష్యం పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. అయితే.. వీటిని అడ్డుకోవడం మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారింది. కేవలం పంజాబ్‌ రాష్ట్రంలోనే గతేడాది దాదాపు 50వేల కేసులు నమోదయ్యాయి.

'ప్రభుత్వ వైఫల్యమే?'

అయితే రైతులకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోవడం కూడా ప్రభుత్వాల వైఫల్యంగానే భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ కాలుష్యం వల్ల దిల్లీ, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి.

ఇదీ చదవండి: 'రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చేందుకు వీలుకాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.