ETV Bharat / bharat

3 నెలల క్వారంటైన్​ పూర్తి.. ఆ పిల్లికి స్వేచ్ఛ!

చైనా నుంచి పొరపాటున చెన్నై ఓడరేవుకు చేరుకున్న ఓ పిల్లి.. మూడు నెలలపాటు క్వారంటైన్​లో గడపాల్సి వచ్చింది. పిల్లి బాధను చూసి జంతు ప్రేమికులు తల్లడిల్లిపోయారు. చివరకు వారి పోరాట ఫలితంగా.. నిర్బంధం నుంచి ఆ మూగజీవికి స్వేచ్ఛ లభించింది. ప్రస్తుతం ఆ పిల్లి చెన్నైలోని క్యాటిట్యూడ్​​ ట్రస్టు సంరక్షణలో ఉంది.

Stowaway cat from China freed after 3 months in quarantine
ఆ పిల్లికి మూడు నెలల క్వారంటైన్ - స్వేచ్ఛ!
author img

By

Published : May 25, 2020, 4:41 PM IST

మూడు నెలలపాటు క్వారంటైన్​లో గడిపిన ఓ పిల్లికి ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. ఇప్పుడది దత్తతకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. పిల్లి ఏంటీ? దత్తత ఏంటీ? దానికి క్వారంటైన్ ఏమిటీ అనుకుంటున్నారా? అయితే చదవండి.

ఈ ఏడాది ఫిబ్రవరి 17న చైనా నుంచి చెన్నై ఓడరేవుకు ఓ కంటైనర్ వచ్చింది. అందులో పిల్లల బొమ్మలతో పాటు ఓ నిజమైన గోధుమ రంగు ఆడ పిల్లి కూడా ఉంది. అయితే అప్పటికే చైనాలో కరోనా విజృంభిస్తోంది. దీనితో అప్రమత్తమైన చెన్నై కస్టమ్స్ అధికారులు.. ఆ పిల్లికి వైద్య పరీక్షలు చేయించి.. క్వారంటైన్​లో ఉంచారు.

పిల్లి ప్రేమికుల ఆందోళన

పిల్లిని నిర్బంధంలో ఉంచడంపై జంతు ప్రేమికులు, పెటా (పీపుల్​ ఫర్​ ద ఎథికల్​ ట్రీట్​మెంట్​ ఆఫ్​ ఏనిమల్స్​) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పిల్లికి స్వేచ్ఛ ప్రసాదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చట్టసభ్యురాలు మేనకా గాంధీ, బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా సహ వ్యవస్థాపకుడు చిన్ని కృష్ణ, ది కాటిట్యూడ్ ట్రస్ట్ సహకారంతో... మూడు నెలలపాటు నిర్బంధంలో ఉన్న పిల్లిని విడుదల చేయాలని పెటా ఇండియా విజ్ఞప్తి చేసింది. దీనితో రంగంలోకి దిగిన తమిళనాడు పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ... ఆ పిల్లిని నిర్బంధం నుంచి విడిపించే ప్రక్రియను సులభతరం చేసింది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఏప్రిల్​ 19న చెన్నై జంతు నిర్బంధ, ధ్రువీకరణ సర్వీస్ (ఏక్యూసీఎస్​)కు కీలక సూచన చేసింది. నిర్బంధంలో ఉన్న పిల్లిని 30 రోజుల క్వారంటైన్ తరువాత... పిల్లుల సంరక్షణకు కృషి చేస్తున్న 'ది కాటిట్యూడ్​ ట్రస్టు'కు అప్పగించాలని పేర్కొంది.

దీనితో క్వారంటైన్​ గడువు పూర్తైన అనంతరం... మే 23న ఆ పిల్లిని 'ది కాటిట్యూడ్​ ట్రస్టు'కు అప్పగించారు.

ప్రమాదం ఉంది.. కానీ

పలు అధ్యయనాల ప్రకారం, పిల్లుల వల్ల ప్రాణాంతక వైరస్​లు సోకే అవకాశముంది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పరిమిత సమాచారం మేరకు.. పెంపుడు జంతువుల వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం చాలా తక్కువ.

ఇదీ చూడండి: జూన్‌లో మరింత తీవ్రంగా వైరస్‌ ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.