ETV Bharat / bharat

'మాయా దీపం'తో 24 గంటలూ వెలుగులే

దీపావళి రోజున వివిధ ఆకృతుల్లో దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీపాలు వెలిగించాక అప్పుడప్పుడు నూనె పోస్తూ ఉండాలి. అయితే.. మాటిమాటికీ దీపాల్లో నూనె పోసుకుంటూ ఉండాల్సిన అవసరం లేకుండా మాయా దీపాలు తయారు చేశారు ఛత్తీస్​గఢ్​కు చెందిన వ్యక్తి. వీటిని ఒక్కసారి వెలిగిస్తే.. 24 గంటలూ వెలుగులు పంచుతాయి.

magic lamp from Kondagaon
'మాయ దీపం'తో 24 గంటలూ వెలుగులే
author img

By

Published : Nov 8, 2020, 1:56 PM IST

వెలుగులు జిమ్మే పండుగ దీపావళి. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి భారీ ఎత్తున అన్ని చోట్లా టపాకాయలను కాల్చే అవకాశం ఉండకపోవచ్చు. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో బాణసంచాను తయారు చేస్తుండటం వల్ల పలు రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. కొవ్వొత్తులు, దీపాలు మాత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో వెలిగించకమానరు. ఈ క్రమంలో ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ వ్యక్తి 24 గంటలూ వెలిగే 'మాయా దీపాల'​ను తయారు చేశాడు.

magic lamp from Kondagaon
వెలుగుతోన్న మాయా దీపం

ఛత్తీస్‌గఢ్‌లో కుండలను తయారు చేసే ఓ వ్యక్తి తన ప్రతిభకు పదునుపెట్టాడు. మాటిమాటికీ దీపాల్లో నూనె అయిపోతే పోసుకుంటూ ఉండాలి. అయితే అలాంటి బాధను తీర్చేలా దాదాపు 24 గంటల నుంచి 40 గంటల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా దీపాలు వెలిగేలా ప్రత్యేకంగా కుండీలను తయారు చేశాడు.

magic lamp from Kondagaon
మాయా దీపాలను తయారు చేస్తోన్న చక్రధరి

అశోక్​ చక్రధరి అనే వ్యక్తి చేసిన 'మాయా దీపం' కుండీలో నూనె దానికదే ప్రహించేలా ఏర్పాటు చేశారు. ఒత్తిని వెలిగించే చిన్నపాటి దీపంపైన నూనె ఉన్న కుండను పెట్టారు. ఆ కుండకు, దీపానికి మధ్యలో రంధ్రం ఉంటుంది. దీని వల్ల కుండలోని నూనె దీపం కుండీలో నిండిన తర్వాత దానికదే ఆగిపోయేలా ఏర్పాటు చేశారు.

magic lamp from Kondagaon
మయా దీపాన్ని తయారు చేస్తోన్న చక్రధరి

వివిధ రకాల టెక్నిక్‌లను చూసి ఈ ల్యాంప్‌ను తయారు చేసినట్లు అశోక్ చక్రధారి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

magic lamp from Kondagaon
అమ్మకానికి సిద్ధంగా ఉన్న మాయా దీపాలు

ఇదీ చూడండి: ఆవుపేడ ప్రమిదలతో సరికొత్తగా ఈ దీపావళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.