ETV Bharat / bharat

'కరోనా కట్టడికి కర్ణాటక విధానాలు పాటించాలి' - corona latest news

కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆదర్శనీయమని కొనియాడింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అన్ని రాష్ట్రాలు అవే విధానాలను అనుసరించాలని సూచించింది. కర్ణాటకలో కొవిడ్​-19 కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్​, ఇంటింటికి వైద్య సర్వే నిర్వహించిన తీరు ప్రశంసనీయమని వెల్లడించింది కేంద్రం.

States asked to replicate initiatives taken by Karnataka for COVID-19 management
'కొవిడ్​పై పోరులో కర్ణాటక విధానాలను అన్ని రాష్ట్రాలు పాటించాలి'
author img

By

Published : Jun 20, 2020, 8:50 AM IST

కరోనా వైరస్​ మహమ్మారిని నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుసరించిన విధానాలను అన్ని రాష్ట్రాలు పాటించాలని సూచించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్, భౌతిక, మొబైల్​ ఆధారిత ఇంటింటి సర్వేతో కర్ణాటకలో కేసులను కట్టడి చేసినట్లు పేర్కొంది. వివిధ రంగాల్లోని సంస్థల ప్రమేయంతో, సాంకేతిక ఆధారిత పరిష్కారాలతో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలను ప్రశంసించింది.

కొవిడ్-19 నిర్వహణలో దేశంలోని అన్ని రాష్ట్రాలు కర్ణాటక తరహాలోనే ముందుకు సాగాలని స్పష్టం చేసింది కేంద్రం. ఆయా రాష్ట్రాలు కర్ణాటక తరహా విధానాలను అవలంబించాలని తెలిపింది. మహమ్మారిని నిలువరిచేందుకు కేసుల కాంటాక్ట్​ ట్రేసింగ్​ అత్యంత ముఖ్యమని పేర్కొంది. కేంద్రం సూచనల మేరకు అధిక ముప్పు, తక్కువ ముప్పు ఉన్న కాంటాక్ట్​లను గుర్తించి.. వాళ్లను క్వారంటైన్​లో ఉంచేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు వివరించింది.

వైరస్​ వ్యాప్తి నియంత్రణకు కర్ణాటక చేపట్టిన చర్యలు..

  • ప్రతి కేసుకు సంబంధించి కాంటాక్టులను ట్రేస్​ చేసి ట్రాక్ చేసింది.
  • అనుమానితులందరూ తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండేలా కఠిన చర్యలు చేపట్టింది.
  • కరోనా నిర్వహణ కోసం 10వేల మందికిపైగా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించింది.
  • మురికి వాడలు, కార్పొరేషన్​ ప్రాంతాల్లో నివసించే కేసుల కాంటాక్టులను తప్పనిసరిగా క్వారంటైన్​ కేంద్రాలకు తరలించింది.
  • ఇతర ప్రాంతాల నుంచి కర్ణాటక వచ్చే వారందరినీ కార్వంటైన్​లో ఉంచింది. వారందరూ సేవా సింధు పోర్టల్​లో ​ నమోదు చేసుకోవాలని తెలిపింది. క్వారంటైన్​లో ఉన్నంత కాలం వారి సమాచారాన్ని తెలుసుకొని.. ఆరోగ్యంలో వచ్చే మార్పుల మేరకు చికిత్సలు చేపట్టింది.
  • క్షేత్ర స్థాయిలో పనిచేసే వారి కోసం క్వారంటైన్​ వాచ్​ యాప్​ను రూపొందించింది. హోం క్వారంటైనాను పకడ్బందీగా అమలు చేయడానికి మొబైల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది.
  • ఎవరైనా హోం క్వారంటైన్​ను ఉల్లంఘిస్తే వెంటనే వారిని ప్రభుత్వ క్వారంటైన్​ కేంద్రాలకు తరలించింది.
  • కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలు కలిగిన వారిని దృష్టిలో ఉంచుకుని భౌతిక, ఫోన్ ఆధారిత ఇంటింటి సర్వే నిర్వహించింది. 168 లక్షల కుటుంబాలకు గాను 153లక్షల కుటుంబాల ఆరోగ్య వివరాలను మే నెలలో సేకరించింది. పోలింగ్ బూత్​ స్థాయి అధికారుల సహకారంతో హెల్త్​ సర్వే యాప్​ను​ ఉపయోగించి దీనిని పూర్తి చేసింది.
  • నాస్కామ్​ సహకారంతో ఆప్తమిత్ర పేరుతో 14410 హెల్ప్​లైన్ నంబర్​ను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలున్న అనుమానితులకు ఫోన్లలోనే వైద్యులు సలహాలు, సూచనలు అందించారు.

ఇదీ చూడండి: వీడియో కాల్​లో బిడ్డను కడసారి చూసుకున్న ఖైదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.