ETV Bharat / bharat

'మహా'పై కరోనా పంజా- 22వేలకు చేరువలో మరణాలు

దేశంలో కొవిడ్​ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న వైరస్​ బాధితుల సంఖ్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 14,492 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 297మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో తాజాగా 7,330 కేసులు వెలుగుచూశాయి. అటు ఉత్తర్​ప్రదేశ్​లోనూ వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

CORONA UPDATES IN INDIA
మహాపై కోరలు చాచిన కరోనా.. 22వేలకు చేరువలో మరణాలు
author img

By

Published : Aug 22, 2020, 7:56 PM IST

Updated : Aug 22, 2020, 8:29 PM IST

కొన్ని నెలలుగా దేశ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది కరోనా వైరస్​. ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో 14,492 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,61,942కు చేరింది. మహమ్మారి ధాటికి మరో 297మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 21,995కు పెరిగింది.

ఇప్పటివరకు మహారాష్ట్రలో 4,80,114 మంది వైరస్​ను జయించి డిశ్చార్జి అయ్యారు. 1,69,516 మంది వివిధ ఆస్పత్రులలో ఇంకా చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాల పరిస్థితి ఇలా...

  • కర్ణాటకలో కొత్తగా 7వేల 330మంది కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణకాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,71,876కు పెరిగింది. వైరస్​ కారణంగా మరో 93 మంది చనిపోగా, ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,615కు చేరింది.
  • తమిళనాడులో 5వేల 980మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 3లక్షల 73వేల 410కి చేరాయి. మరో 80 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 6,420కు పెరిగింది.
  • దిల్లీలో కొత్తగా 1,412 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ రాజధానిలో లక్షా 60వేల 16మంది కరోనా బారినపడ్డారు. మరో 4వేల 284మంది కొవిడ్​కు బలయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 5,375 కరోనా కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 1,82,614కు చేరింది. మరో 70 మరణాలతో, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,867కు చేరింది.
  • కేరళలో శనివారం.. 2 వేల 172 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 56,354కు పెరిగింది.
రాష్ట్రంమొత్తం కేసులుమరణాలు
మధ్యప్రదేశ్​51,8861,206
జమ్ముకశ్మీర్​31,981608
ఛండిగఢ్​2,77633

ఇదీ చదవండి: దేశంలో 75 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు

Last Updated : Aug 22, 2020, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.