రాజకీయ సమావేశాలకు అనుమతులివ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. అయితే, సమావేశాలు కేవలం కంటైన్మెంట్ జోన్ల బయటే జరగాలని ఆదేశించింది. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు, మరో 11 రాష్ట్రాల్లో పార్లమెంట్, శాసన సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్న వేళ ఆయా నియోజకవర్గాల్లో 100 మందికి మించకండా సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించింది.
"రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్లకు వెలుపల, 100 మంది మించకుండా రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు జారీ చేయొచ్చు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో అక్టోబర్ 15వ తేదీలోపు ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. "
- హోం మంత్రిత్వ శాఖ
అయితే, ఈ సమావేశాల్లో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది హోం శాఖ. భౌతిక దూరం, మాస్కులు లేకుండా హాజరు కావద్దని తెలిపింది.
ఇదీ చదవండి: పండుగల వేళ విమాన సర్వీసులు పెంపు!