ETV Bharat / bharat

జమ్మూ జెండాకు రాంరాం..! తుపాకీ నీడలోనే కశ్మీర్​ - భద్రత

జమ్ముకశ్మీర్​ అంశంపై కేంద్రం నిర్ణయం అనంతరం.. అక్కడ సమూల మార్పులు రానున్నాయి. అధికరణ 370 రద్దుతో జమ్మూ రాజ్యాంగంలోని అధికరణ 35-A కూడా రద్దవుతుంది. ఈ కారణంగా రాష్ట్ర అధికారిక జెండాను త్వరలోనే పూర్తిగా తొలగించనున్నారు. మరోవైపు కశ్మీర్​లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​, ముఫ్తీలు సహా 500 మందికి పైగా వివిధ పార్టీల నేతలు నిర్బంధంలోనే ఉన్నారు.

జమ్మూ జెండాకు రాంరాం..! తుపాకీ నీడలోనే కశ్మీర్​
author img

By

Published : Aug 8, 2019, 5:43 AM IST

Updated : Aug 8, 2019, 1:37 PM IST

జమ్మూ జెండాకు రాంరాం..! తుపాకీ నీడలోనే కశ్మీర్​

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దుతో రాష్ట్ర రాజ్యాంగంలోని ఆర్టికల్​ 35-A కూడా రద్దవుతుంది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగానూ విభజించారు. ఈ కేంద్ర నిర్ణయంతో అక్కడ ఎన్నో మార్పులు రానున్నాయి. మొదటగా.. జమ్ముకశ్మీర్​ అధికారిక జెండాను శాశ్వతంగా తొలగించనున్నారు. ఇప్పటివరకు ఆర్టికల్​ 370 కల్పించే ప్రత్యేక అధికారాలతో జమ్ముూలో భారత జాతీయ జెండాతో పాటు.. రాష్ట్ర అధికారిక జెండాను ఎగురవేసే అధికారం ఉంది.

అయితే.. ఆగస్టు 5న ఈ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా... త్వరలోనే తమ రాష్ట్ర జెండాపై కశ్మీర్​ పూర్తి అధికారం కోల్పోనుంది. నివేదికల ప్రకారం శ్రీనగర్​ సెక్రటేరియట్​ భవనంలో భారత త్రివర్ణ పతాకంతో పాటుగా ఎరుపు రంగుతో నాగలి గుర్తు, 3 నిలువు గీతలతో ఉండే తమ అధికారిక పతాకాన్ని ఇప్పటికీ ఎగురవేస్తున్నారు.

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ స్పీకర్​ నిర్మల్​ సింగ్​.. తన అధికారిక వాహనంపై రాష్ట్ర జెండాను తొలగించిన తొలి చట్టసభ సభ్యునిగా నిలిచారు. జెండా శాశ్వత తొలగింపు అంశంపై త్వరలోనే ప్రకటన జారీ చేసే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు.

500 మందికి పైగా నిర్బంధంలోనే...

అధికరణ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన అనంతరం.. ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పలువురు రాజకీయ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో సహా 560 మందికి పైగా నిర్బంధంలోనే ఉన్నారు. మాజీ సీఎంలను గుప్కార్​ రోడ్​లోని హరి నివాస్​లో ఉంచగా.. మిగతా వారిని శ్రీనగర్​లోని షేర్​-ఇ-కశ్మీర్​ నిర్బంధ కేంద్రాల్లో ఉంచినట్లు సమాచారం.

ఇదీ చూడండి: నిఘా నీడలో కశ్మీర్​.. స్తంభించిన జనజీవనం

భద్రతా సిబ్బంది పహారాలోనే...

లోయలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్​ కొనసాగుతూనే ఉంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ ఢోబాల్​ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. షోపియాన్​ జిల్లాలోని రోడ్లపై సాధారణ జనంతో కలిసి భోజనం చేస్తూ బుధవారం కనిపించారు. తాజా పరిణామాలపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

కొన్ని చోట్ల నిరసనలు చెలరేగినా.. బలగాల అప్రమత్తతతో సద్దుమణిగారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పలు విద్యాసంస్థలను మూసివేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. సమాచార వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప స్థానికుల్ని ఇంటి నుంచి బయటికు వెళ్లనివ్వట్లేదు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: IGA Stadium, Montreal, Canada - 6th August 2019
Felix Auger-Aliassime vs. Vasek Pospisil:
1. 00:00 1st set, 7th game: Auger-Aliassime winner
2. 00:15 2nd set, tiebreak: Pospisil winner
3. 00:28 3rd set, 12th game: Pospisil winner to make it 6-6
4. 00:38 Tiebreak: Auger-Aliassime winner
5. 00:49 Game, set and match Auger-Aliassime
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:11
STORYLINE:
Felix Auger-Aliassime was given a stiff workout by Vasek Pospisil on Tuesday before making it through to the second round of the Rogers Cup in Montreal.
Playing in his home town, the 18-year-old world number 21 defeated his compatriot 6-2, 6-7 (3), 7-6 (3).
It took two hours and 33 minutes to secure the win - far longer than many observers might have expected.
Last Updated : Aug 8, 2019, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.