ETV Bharat / bharat

అయోధ్య గుడిపై ఊరూరా ప్రచారం

author img

By

Published : Dec 14, 2020, 3:18 PM IST

రామమందిర నిర్మాణానికి మద్దతుగా దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది. సంక్రాంతి నుంచి ఆలయ విశేషాలను నాలుగు లక్షల గ్రామాల ప్రజలకు వివరించి చెప్పనున్నట్లు వెల్లడించింది.

Sri Rama Janmabhoomi Tirthakshetra Trust a nationwide program will be launched in support of the construction of the Ram Mandir
రామాలయ నిర్మాణానికి మద్దతుగా దేశవ్యాప్త కార్యక్రమం!

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా దేశవ్యాప్త కార్యక్రమం చేపట్టనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పేర్కొంది. నాలుగు లక్షల గ్రామాలను ఈ కార్యక్రమం ద్వారా మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. జనవరి 15 మకర సంక్రాంతి రోజు నుంచి ఫిబ్రవరి 14 వరకు మందిర నిర్మాణ విశేషాలను ఊరూరా వివరించనున్నట్లు చెప్పారు.

రామ మందిర ట్రస్ట్​తో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్​(వీహెచ్​పీ), హిందూ సంఘటన్ వంటి సంస్థలూ ఇందులో పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు ట్రస్టు ప్రతినిధులు.

ఇదీ చూడండి: ఐఐటీ మద్రాస్​ కార్యకలాపాలు బంద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.