ETV Bharat / bharat

ఈ కిట్​తో 2 గంటల్లోనే 30 మందికి కరోనా పరీక్ష - శ్రీచిత్ర తిరునాల్‌ ఇనిస్టిట్యూట్‌

రెండు గంటల్లోనే కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడించే కొత్త కిట్​ను కేరళలోని శ్రీచిత్ర తిరునాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్ మెడికల్‌ సైన్సెస్‌ అండ్ టెక్నాలజీ రూపొందించింది. జీన్​ల్యాప్-ఎన్ కిట్ పేరుతో తయారు చేసిన ఈ కిట్​ ద్వారా తక్కువ సమయంలోనే 100 శాతం కచ్చితత్వంతో ఫలితాలు పొందవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 30 నమూనాలు ఒకేసారి పరీక్షించవచ్చని తెలిపింది. ప్రతిరోజు పెద్దసంఖ్యలో నమూనాలు పరీక్షించడానికి ఈ విధానం వీలవుతుందని స్పష్టం చేసింది.

sri chitra institute
శ్రీచిత్ర తిరునాల్‌ ఇనిస్టిట్యూట్‌
author img

By

Published : Apr 17, 2020, 11:20 AM IST

కరోనా పరీక్షల వేగం పెంచే విధంగా కేరళలోని శ్రీచిత్ర తిరునాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్ మెడికల్‌ సైన్సెస్‌ అండ్ టెక్నాలజీ(ఎస్​ఐఎంఎస్​టీ) కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రెండు గంటల్లోనే కొవిడ్ పరీక్ష చేసి ఫలితాన్ని వెల్లడించే కొత్త కిట్‌ను ఈ సంస్థ రూపొందించింది. దీనికి జీన్‌ల్యాప్‌-ఎన్‌ కిట్‌గా నామకరణం చేసింది.

ప్రపంచంలోనే తొలిసారి

రివర్స్‌ ట్రాన్స్‌స్క్రిప్టేజ్ లూప్ మీడియేటెడ్ యాంప్లిఫికేషన్‌ ఆఫ్‌ వైరల్‌ న్యూక్లియక్‌ యాసిడ్‌(ఆర్​టీ-ఎల్​ఏఎంపీ) విధానం ద్వారా ఇది సార్స్‌-సీఓవీ2కి చెందిన ఎన్‌-జీన్‌ను గుర్తిస్తుంది. ఇలా గుర్తించడం బహుశా ప్రపంచంలోనే తొలిసారి కావొచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది కరోనా వైరస్​కి చెందిన రెండు ఎన్-జీన్‌ ప్రాంతాలను గుర్తించగలుగుతుందని... అందువల్ల ప్రస్తుత సంక్రమణ సమయంతో ఈ వైరస్‌ జన్యువులోని ఒక ప్రాంతంలో మ్యుటేషన్‌ సరిగా కనిపించకపోయినా.. పరీక్ష ఫలితం మాత్రం కచ్చితంగా వస్తుందని శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది.

ఒకేసారి 30 నమూనాలు

కేరళలోని అలప్పుజా ఐసీఎంఆర్ అధీకృత ప్రయోగశాలలో ఈ కొత్త విధానం ద్వారా పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రస్తుత పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్​టీ-పీసీఆర్‌తో సమానంగా 100 శాతం.. కచ్చితత్వంతో ఫలితాలు వెలువడినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో జీన్‌ గుర్తింపునకు పది నిముషాల సమయం పడుతుందని, ఆర్‌ఎన్‌ఎ సేకరణ నుంచి.. పరీక్ష ఫలితం వెల్లడించేంత వరకు రెండు గంటల్లోపు సమయం తీసుకుంటోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక యంత్రంతో ఒక బ్యాచ్​లో 30 నమూనాలు ఒకేసారి పరీక్షించవచ్చని తెలిపింది. ప్రతిరోజు పెద్దసంఖ్యలో నమూనాలు పరీక్షించడానికి ఈ విధానం వీలవుతుంది.

వెయ్యిలోపే ఖర్చు

ఎస్​ఐఎంఎస్​టీ సంస్థలోని అప్లైడ్ బయాలజీ విభాగం మూడు నెలల్లోనే దీన్ని అభివృద్ది చేసిందని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఒక్కో పరీక్షకు వెయ్యి రూపాయల లోపే ఖర్చు అవుతుందని, పరిమితమైన సిబ్బంది, సౌకర్యాలు ఉన్న జిల్లా స్థాయి ప్రయోగశాలల్లో కూడా దీన్ని ఏర్పాటు చేసి సులభంగా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ సంస్థ ఇప్పటికే ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించింది. ప్లాస్మా సేకరణ కోసం డ్రగ్ కంట్రోలర్ నుంచి తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.