స్పైస్ జెట్ విమానయాన సంస్థ.. సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేసింది. ఇప్పటివరకు వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించిన సేవలను వాట్సాప్ లోనూ అందించేందుకు సిద్ధమైంది.
6000000006 వాట్సాప్ నెంబరుపై ప్రయాణికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది స్పైస్ జెట్ ఆటోమేటెడ్ ఏజెంట్.. మిస్ పెప్పర్. వాట్సాప్ లో మీ సందేహాలను పంపిన వెంటనే.. మిస్ పెప్పర్ రిప్లై ఇస్తుంది. అంతే కాదు, బోర్డింగ్ పాస్ కూడా మీ ఫోన్కు పంపేస్తుంది.
ఇంటర్నెట్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా పనిచేసే వాట్సాప్ ఇప్పుడు దాదాపు అందరి ఫోన్లలోనూ ఉంది. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం.. ఈ నిర్ణయం తీసుకుంది స్పైస్ జెట్.
మే 25న దేశీయ విమానయానానికి అనుమతులిస్తూ.. కొన్ని ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం. భౌతిక దూరం, ఇతర కరోనా జాగ్రత్తల దృష్ట్యా.. విమానం కదలడానికి 48 గంటల ముందే ఆన్లైన్ లో చెక్-ఇన్ అవ్వాలని సూచించింది. దీంతో, స్పైస్ జెట్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ సేవలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: అన్నీ మరచిపోయి ముందుకు సాగాలి: గహ్లోత్