రాజస్థాన్‌లోని సవాయ్‌మాధోపూర్‌లోని రణతంబోర్ పులుల అభయారణ్యం మధ్యలో కొలువై ఉన్న త్రినేత్ర గణేశ్ దేవాలయం భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతోంది. అనేక నమ్మకాలతో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ముఖ్యంగా సమస్యలు చెప్పుకుంటూ, తీర్చమని వేడుకుంటూ భక్తులు రాసే ఉత్తరాలు.
జైపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని సవాయ్ మాధోపూర్ జిల్లా రణతంబోర్ కోటలో ఉందీ మహిమాన్విత క్షేత్రం. ఆరావళి, వింధ్య పర్వతాలు కలిసేచోట 1580 అడుగుల ఎత్తులో కొలువుదీరింది.
"త్రినేత్ర గణేషుడు స్వయంభువుడు. వెనక ఉన్న కొండ నుంచి ఉద్భవించారు. ఆయన ఇద్దరు భార్యలు బుద్ధి, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ విగ్రహాలూ నెలకొల్పారు. ఇక్కడ గణనాథుడిని మూడు నేత్రాలు ఉంటాయి. వెనక మూషిక వాహనం ఉంటుంది. ఈ ఆలయం 1,000 ఏళ్ల పురాతనమైనది."
- దుర్గాశంకర్ శర్మ, పూజారి- త్రినేత్ర గణేశ ఆలయం
ఆ విగ్రహమే మొదటిది...
త్రినేత్రగణేష్ ప్రదక్షిణ వైశాల్యం సుమారు 7కిలోమీటర్లు. అక్కడి విగ్రహమే దేశంలోని గణేష్ విగ్రహాల్లో మొదటిదిగా చెబుతారు. ఈ మందిరం దేశ ప్రాచీన ఆలయాల్లో ఒకటి. రామాయాన, భారత కాలల్లోనూ ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది.
"ఆలయ చరిత్ర చూస్తే, కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకోవడానికి వెళుతూ గణేశుడి ఆహ్వానించటం మరిచి పోయారు. తర్వాత ఎలుక వచ్చి కృష్ణుడి రథం చుట్టూ భూమిని తవ్విపోయింది. అప్పుడు నారదుడు వినాయకుడికి ఆహ్వానం పంపని సంగతి గుర్తు చేశారు. తర్వాత రణతంబోర్ గణేశుడికి ఆహ్వానం పంపారు. అనంతరం రథం ముందుకు కదిలింది."
- పండిత్ పురుషోత్తం గౌర్, జోతిష్యుడు.
ఉత్తరాలు రాస్తే కష్టాలు తీరిపోతాయ్!
ఈ ఆలయంలో ప్రతిష్టించిన గణనాథు త్రినేత్రుడు. ఆయన కుటుంబం ఇద్దరు భార్యలు, రిద్ధి, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ విగ్రహాలూ నెలకొల్పారు. దేశంలో మరెక్కడా గణపతి కుటుంబం విగ్రహాలు లేవు. దాంతోపాటు భక్తుల ఉత్తరాల కారణంగా ఇది మరింత ప్రసిద్ధి పొందింది. అందుకోసం బైఖేడా ఆలయం, సవాయ్‌మాధోపూర్, రణతంబోర్, పిన్‌కోడ్ నంబర్ 322021 పేరుతో భక్తులకు గుడి చిరునామా ఇస్తారు. ఈ రోజుకూ పోస్ట్‌మాన్ అక్కడికి ఉత్తరాలు బట్వాడా చేస్తుంటాడు. భక్తులు పంపించే లేఖలు, ఆహ్వానపత్రాలు అన్నీ భద్రంగా ఆయన చెంతకు చేరతాయి. ఉద్యోగాలు, పదోన్నతులు మొదలు ఎన్నో కోరుకుంటూ భక్తులు పంపే ఉత్తరాలు త్రినేత్ర గణేషుని పాదాల గుట్టలుగా ఉంటాయి. ఆ గణనాథుడే వాటికి పరిష్కారాలు చూపిస్తారని నమ్ముతారు.
"సంతానం, ఉద్యోగం - పదోన్నతి, మరెన్నో చింతలు తీర్చమని త్రినేత్ర గణేశుడిని భక్తులు వేడుకుంటారు. వారి మనస్సుల్లో కోరుకున్న అన్నింటినీ దేవుడు పూర్తి చేస్తాడు. త్రినేత్ర గణేశ్ దర్శనభాగ్యంతోనే ప్రపంచంలోని అన్ని సమస్యలు దూరమై పోతాయి."
- దుర్గాశంకర్‌శర్మ, పూజారి
రాజుకు విజయవరం..!
రణతంబోర్ రాజైన హమీర్‌దేవ్ 10వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించారు. రాజా హమీర్‌దేవ్ అల్లాఉద్దీన్‌ఖిల్జీతో వీరోచితంగా పోరాడినట్లు చెబుతారు. ఆ యుద్ధ సమయంలో ఒకరోజు గణేషుడ్ రాజు కలలోకి వచ్చి విజయవరం ఇచ్చారట. ఆ విజయం తర్వాత రాజా హమీర్ కోటలోపల గణేషునిఆలయం నిర్మించారు.
"రణతంబోర్ యుద్ధసమయంలో దిల్లీ పాలకుడు అల్లాఉద్ధీన్ ఖిల్జీ సేనలు అన్ని వైపుల నుంచి దండెత్తాయి. ఆ సమయంలో మహారాజుకు కలలో త్రినేత్ర గణేశ్ దర్శనం కలిగింది. త్రినేత్ర గణేశ పూజ చేయమని ఆకాశవాణి వినిపించింది. నిద్ర నుంచి మేల్కొన్న రాజు త్రినేత్ర గణేశుడి ఎక్కడా అని వెదుక్కుంటూ వెళ్లి రణతంబోర్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత విజయం సాధించారు."
- పండిత్ పురుషోత్తం గౌర్
ఏటా అక్కడ గణేష్ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొనేందుకు లక్షలాదిమంది భక్తులు వస్తారు. ఈసారి కరోనా కారణంగా 3కిలోమీటర్ల ముందే మార్గాన్ని మూసి వేశారు. ఫలితంగా భక్త జనం త్రినేత్ర గణేషుడి దర్శనభాగ్యానికి నోచుకోక పోయినా కరోనాపై విజయం కోసం భారీగా ఆయనకు ఉత్తరాలు రాస్తున్నారు.
ఇదీ చూడండి: పంజాబ్ వీధుల్లో పరుగులు పెట్టించి మరీ..!