ETV Bharat / bharat

కొత్త సంవత్సరానికి కోటి ఆశల స్వాగతం

కాలం ఒడికి చేరుతున్న 'కరోనా' ఏడాదికి ఇక ముగింపు. కొత్త సంవత్సరానికి కోటి ఆశల మేళవింపు. నిన్నటి ఏడాదిగా కాలం ఒడిలోకి నిష్క్రమిస్తోన్న ఏడాది సమయానికి ఇది సమీక్షణం. రాబోయే నవ్యపథానికి ఇది కావాలి దిశానిర్దేశం. అందుకే దిగంతాలకు తెలిసేలా, నలుచెరగులా దశదిశలా వినోద, ప్రమోదాలు విరియాలి.

Special story on 2020 Review
కొత్త సంవత్సరానికి కోటి ఆశల మేళవింపు..
author img

By

Published : Dec 31, 2020, 5:02 PM IST

కాలగమనంలో ఏడాదంటే తక్కువేమీ కాదు. ఏడాదంటే ఎన్నో మైలురాళ్లుంటాయి. విషాదం మిగిల్చిన ఘటనలుంటాయి. మరచిపోలేని మధుర స్మృతులూ ఉంటాయి. అలానే 2020 ఎన్నో చేసింది.. ఎన్నో చూపింది. కొందరికి మోదం మిగిల్చితే, మరి కొందరికి ఖేదాన్నిచ్చింది. ఏదేమైనా నిష్క్రమిస్తోన్న పాత సంవత్సరం గత సంవత్సరంగా కాలం ఖాతాలో వేసుకునే వేళయింది.

నూతన సంవత్సరం.. ఆలోచనకూ, ఆచరణకూ సంధికాలం. కొత్త సంవత్సరం అంటే కొత్త సంకల్పం తీసుకునే రోజు.

శత సహస్ర తంత్రులు మీటిన నవోత్సాహం. వరవీణలు మోగి, శుభసంకల్పాలకు మొగ్గతొడిగి నవపథానికి అడుగులు వేస్తూ, ఉత్తేజంతో ముందుకుసాగేందుకు పూనిక ఈ విశ్వవేడుక. చీకటి వెలుగుల దోబూచుల కేళి.. రంగేళి. ఉషోదయానికి, నవోదయానికి ఎదురుచూస్తున్నాం.

అంతా ఒక్కటే..

భూగోళంలో ఖండఖండాలలో ఎన్ని వైవిధ్యాలున్నా, వైరుధ్యాలున్నా దేశదేశాలు ఒక్కటే. మనుషులంతా ఒక్కటే. ప్రవహించే రక్తం ఒక్కటే. ఉమ్మడి శత్రువును తుదముట్టించాలని ఉక్కుసంకల్పం తీసుకున్నాం. కసిని కృషిగా మలుచుకొన్నాం. పుణికిన చైతన్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ విశ్వవేడుకలు.. విశ్వమంతా పండుగకు వేదికలు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఒక మంచిపనికి పూనిక వహించి, సదాశయ సిద్ధికి సంకల్పంతో ముందుకు నడిస్తే చీకటే మాసిపోతుంది. లోకమే మారిపోతుంది.

కత్తుల వంతెనలు కుదరవిక..

కోటి ఆశలతో ముందుకు సాగే వేళ. ఆశయ సాఫల్యానికి సంకల్పం తీసుకునే శుభ వేళ. పరుగెత్తేది కాలమా? పరుగెత్తించేది కాలమా? రెండూ నిజమే. 2020లా కాలానికి కత్తుల వంతెనలు కుదరవిక. టీకా వచ్చేస్తోంది..కొవిడ్ మహమ్మారి ఆటలు ఇకసాగవంటూ నిఖిలలోకం ఒక్కటైంది. ఏది ఎలా ఉన్నా కరోనా, లాక్​డౌన్​లు ప్రజల జీవన శైలిని, జీవన గమనాన్ని ఎంతో మార్చేశాయి.. సంక్షోభంలోనే అవకాశాలు లభించాయి. ఆవిష్కారాలు అనేకం వచ్చేశాయి. అద్భుతాలూ చోటు చేసుకున్నాయి. 2021 నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతిద్దాం. ఆహ్లాదంగా ఆహ్వానం పలుకుదాం.

కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తుంది. శుభాలు జరగాలన్న కోరిక. సమస్యలు సమసిపోవాలన్న ఆకాంక్ష. అదృష్టం వరించ వచ్చన్న ఆశ. లక్ష్యం సాధిస్తామన్న ధీమా. నూతన సంవత్సరం వస్తుందంటే ఆశలు రెక్కలు కట్టుకుని మనసంతా విహరిస్తుంది.

కానీ కరోనా నేర్పింది కేవలం పాఠాలే కాదు.. గుణపాఠాలు కూడా. అవేంటో చూద్దాం.

విరుచుకుపడిన కరోనా..

రాజ్యాలు అభివృద్ధి గణాంకాలు రాసుకుంటున్న సమయం అది. దేశాల మధ్య వాణిజ్య బంధాలు బలపడి.. సహృద్భావాలు వెల్లివిరుస్తున్న వేళ.. అది. అప్పుడు హఠాత్తుగా ఉమ్మడి శత్రువులా విరుచుకుపడింది కరోనా.

Special story on 2020 Review
ప్రపంచంపై కరోనా మహమ్మారి విజృంభణ

భూమండలానికే భస్మాసుర హస్తంలా మారింది. మోహరించే సైన్యాలతో పోరాడవచ్చు. కానీ కంటికి కనపడని నరహంతక శత్రువు కరోనాతో ఎలా పోరాడాలి? ప్రపంచం తలలు పట్టుకుంది.

కొవిడ్ మహమ్మారి నిరోధ వ్యాప్తికి భారత్‌ ముందుగా అప్రమత్తమై లాక్ డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తర్వాత నెలలపాటు పొడిగించారు. అత్యవసర సేవలనూ ఆంక్షలతో అనుమతించారు. గ్రామాల నుంచి వచ్చిన కార్మికుల వలస అప్పుడు ఉద్ధృతమైంది.

ఊహించని వేదన..

2020 అంటే ఆకర్షణీయమైన అంకెలు. నిజంగా 2020 సంవత్సరం 2020 క్రికెట్ అంత ఆనందంగా. ఆస్వాదయోగ్యంగా ఉంటుందని భావించాం. కానీ మోదానికి బదులు ఖేదాన్ని పంచింది. కొవిడ్‌ మృత్యుఘంటికలు మోగిస్తుంటే అగ్రరాజ్యాలే అతలాకుతలమయ్యాయి. అనేక దేశాలు.. దేశాల సరిహద్దులు మూసేశాయి. భూగోళం బిగుసుకుపోయిన భయ విహ్వల అయింది. ఇల్లే పదిలమని, స్వీయ నిర్బంధంలో ఉండి కంటికి కనపడని రాక్షసునితో విజయం తథ్యమని విశ్వసించాం. నిశ్శబ్ద సంగ్రామంలో దాదాపు విజయం అంచుకు చేరుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో రానున్న టీకాలతో, మరిన్ని ఔషధ ఆవిష్కారాలతో అందరికీ ఆరోగ్యభాగ్యం సమకూరుతుందన్న విశ్వాసం బలపడింది.

Special story on 2020 Review
కరోనాతో బోసిపోయిన క్రికెట్​ మైదానాలు

కరోనాను మనం తుదముట్టించే సమరంలో.. గత పది నెలలుగా దేశంలో ప్రజాజీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. సంక్షోభం కొన్నింటికి పరిష్కారం సూచించింది. మరోవైపు కొత్త అవకాశాలను సృష్టించింది. అవును.. సంక్షోభం నుంచే పరిష్కారం పుడుతుంది. ఆపత్కాలంలోనే ఆలోచనలు చిగురులు వేస్తాయి. అవకాశాలు లభిస్తాయి.

కొవిడ్ వల్ల దేశంలో లావాదేవీలు, చెల్లింపులు అత్యధికంగా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులలో భారత్ ఎంతో ముందుకు వెళ్లిందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం ప్రశంసించారు.

ఆన్​లైన్ క్లాసులు..

విద్యారంగంలో పెనుమార్పులు వచ్చాయి. విద్యార్థులు సాంకేతికతతో స్నేహం చేశారు. ఉపాధ్యాయుల సమక్షంలో, తరగతి గదిలోనే విద్యార్థి బుద్ధివికాసం సాధ్యమని విశ్వసించాం. విద్యార్థులకు పాఠాలు అంటే నేరుగా ఉపాధ్యాయులు చెబితేనే పాఠాలు అని భావించాం. కానీ కొవిడ్ ముప్పుతో.. విద్యాసంస్థలు నెలల పాటు తెరుచుకోలేదు. ఆన్​లైన్ బోధన ప్రారంభమైంది. పాఠశాలలు లేవు. బిడ్డల భవిష్యత్తు ఎలా? అని తల్లిదండ్రులు కొంత బాధపడినా, కొవిడ్ బారినపడటం కంటే ఇంట్లో ఉండి చదివే ఆన్​లైన్ విద్యే మేలని తలచారు. మొబైల్ ఫోను, టీవీ ఉంటే ఎక్కడైనా పాఠాలు నేర్చుకోవచ్చని తెలియజెప్పిన సంవత్సరం 2020. పార్టీలే కాదు, విద్యాగోష్టులు, ఆధ్యాత్మిక సమావేశాలు, ఏ సమావేశాలైనా వెబ్​లోనే. వెబినార్లతో అనుసంధానం కావటం పెరిగింది.

Special story on 2020 Review
ఆన్​లైన్​ తరగతులు

కరోనా తెచ్చిన మార్పులు

  1. కరోనా తెచ్చిన మార్పులను అవలోకిస్తే... అందరూ ఇంటికే పరిమితమైన వేళ ఆత్మీయతలు వెల్లివిరిశాయి. మానవ సంబంధాలు బలపడ్డాయి. ఇంటిపనులు, వంటపనుల్లో పురుషులూ చేయి కలిపారు.
  2. వెబినార్లలో దృశ్య, శ్రవణ సమ్మేళనంతో చర్చలు జరిగాయి.
  3. డిజిటల్‌ ఎకానమీ దిశగా దేశం అడుగులు వేసింది.
  4. కుటుంబ బంధాలు, విలువలను పదిలపర్చింది. చిన్ననాటి రోజులను తిరిగి తెచ్చింది.
  5. ప్రజా రవాణా నిలిచిపోవటం వల్ల ప్రజలు వాహనాల కొనుగోళ్లు ప్రారంభించారు. సెకెండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ పెరిగింది.
  6. బయటి ఆహారం కంటే ఇంట్లో వండిపెట్టిన ఆహారం తిని ఆరోగ్యంగా తయారయ్యారు. బర్గర్లు, పీజాలు లేవు.
  7. చిన్నప్పటి ఆటలు, టీవీలో మళ్లీ రామాయణ భారతాలు.
  8. కాలుష్యం తగ్గింది. వాయు, జల కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇంట్లోనే వ్యాయామం. పర్యావరణానికి మేలు జరిగింది.
  9. డబుల్ డెక్కర్ విమానాలు వచ్చాయి. భౌతిక దూరం పాటించడం అనివార్యం కావటం వల్ల కార్యాలయాలు, బస్సులు, రైళ్లలో అందుకు అనుగుణంగా కూర్చునే సదుపాయాలు వచ్చాయి.
  10. శుచి, శుభ్రతకు ప్రాధాన్యం లభిస్తోంది. రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు సుగంధ ద్రవ్యాల్లో పసుపు, మిరియాలు, వాము, శొంఠి, జీలకర్ర వాడకం పెరిగింది. గ్రీన్ టీ, వేడినీరు, కషాయాల వినియోగం పెరిగింది.
  11. టోల్ ప్లాజాల దగ్గర ఆగనవసరం లేకుండా ఫాస్టాగ్​ల వినియోగం పెరిగింది. సినిమాల విడుదలకు ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వెబ్ సిరీస్ వచ్చాయి.

వైద్య ఆరోగ్యరంగం

కొవిడ్ సంక్షోభం మన వైద్యఆరోగ్య వ్యవస్థ పనితీరుకే పరీక్షపెట్టింది. మార్పులకు అవకాశమిచ్చింది. రోగులు వైద్యులను సంప్రదించటానికి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. నేరుగా వెళ్లి కలసి వైద్యసలహాలు తీసుకునే పద్ధతి తాత్కాలికంగా కనుమరుగైంది. కరోనా ఉద్ధృతమైన తొలి రోజుల్లో కొవిడ్‌ ఆస్పత్రులు కిటకిటలాడాయి. మూడు నెలలుగా కొవిడ్ ఆస్పత్రులలో పడకలు దాదాపు ఖాళీగా ఉన్నాయి. అంటే కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే రోగులు అప్రమత్తమై వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించారు. రోగనిరోధక శక్తిపెరిగే ఆహారం తీసుకొని జాగ్రత్త పడ్డారు. ఆరోగ్య పరిరక్షణ స్పృహ పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకొని ప్రాణాలు కాపాడుకున్నారు.

Special story on 2020 Review
రోగులు వైద్యులను సంప్రదించటానికి అందుబాటులోకి యాప్స్

కొవిడ్ సంక్షోభం ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అవకాశంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో అన్ని ఆసుపత్రులలో సదుపాయాలు మెరుగయ్యాయి. ఆక్సిజన్ అందించే సదుపాయాలతో పడకలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఉండే తేలికభావం పోయింది.

ఆర్థిక వ్యవస్థకు ఆత్మనిర్భరం

లాక్​డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పెనుసంక్షోభం దిశగా పయనించింది. నష్టాలతో వివిధ రంగాల ఉనినికే ముప్పు ఏర్పడింది. దేశ భద్రత ఎంత ముఖ్యమో, ఆర్థిక భద్రత అంతే ముఖ్యం. ఉద్దీపనలు, ఉపశమనాలు, ఆత్మనిర్భర్‌ చర్యలతో ఆత్మవిశ్వాసం కల్పించింది కేంద్రం.

Special story on 2020 Review
ఉద్దీపన ప్యాకేజీపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చర్చ

ఈ నేపథ్యంలో ఆర్థికానికి ఆసరాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ఆత్మ నిర్భర్ భారత్' అభియాన్ ప్యాకేజీని ప్రకటించారు.

ఇందులో భాగంగా 20,97,0.53 కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపనలు అందజేస్తామని ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్‌ అభియాన్​ను ఐదుదశలలో అమలు చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అత్యంత దారుణంగా నష్టపోయిన రంగాలు మనుగడ సాగించేందుకు కేంద్రం రుణ సహకారం అందించింది.

ప్రపంచంలో కరోనా అత్యంత దారుణంగా దెబ్బతీసిన ఆర్థిక వ్యవస్థ భారత్​దే. ఆర్థిక మాంద్యం రోజుల్లో కూడా మనదేశం ఇంతగా నష్టపోలేదు. కొవిడ్-19 వల్ల దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధులు కోల్పోయారు. కేవలం తొలి 21 రోజుల లాక్ డౌన్ వల్లనే ఆర్థిక వ్యవస్థకు 32 వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. అంటే $4.5 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.

లాక్​డౌన్​ వల్ల మార్కెట్ స్థిరత్వం లేకపోవటంతో దేశ వృద్ధి రేటు 2020 నాలుగో త్రైమాసికానికి 3.1 శాతానికి పడిపోయినట్లు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ సలహాదారు ప్రకటించారు. 2020-21 మొదటి త్రైమాసికంలో జీడీపీ ఆందోళనకరంగా -24 శాతానికి తగ్గిపోయింది. పర్యటక, ఆతిథ్య రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. వ్యాపార రంగం భారీ నష్టాలు చవిచూసింది. వ్యాపార రంగానికి 53 శాతం నష్టం వాటిల్లింది.

డిజిటల్​ చెల్లింపులు పెరిగాయి..

మరో వైపు కొవిడ్ ప్రభావంతో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. బిల్​గేట్స్.. భారత్‌ నగదు బదిలీ విధానాన్ని ప్రశంసించారు. సింగపూర్ ఫిన్‌ టెక్ సదస్సులో భారత్​ను మెచ్చుకున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా నగదు బదిలీ చేసే యూపీఐ విధానం విశిష్టమైందని కితాబునిచ్చారు. యూపీఐ విధానం కొవిడ్ కాలంలో ఎంతో బాగా ఉపయోగపడిందన్నారు. నూతన ఆవిష్కరణల గురించి వెదకాలంటే ఇక ప్రపంచం చైనా వైపు కాకుండా భారత్ వైపు చూడాలని బిల్ గేట్స్ అన్నారు.

Special story on 2020 Review
పెరిగిన డిజిటల్​ పేమెంట్స్​

చిత్రపరిశ్రమ కష్టాలు..

చిత్రపరిశ్రమ సంక్షోభానికి లోనైంది. నెలల పాటు సినిమా షూటింగులు, టీవీ షూటింగులు నిలిచిపోయాయి. దీంతో సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారిని ఆదుకోవటానికి సినీనటులు ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థలు సహకరించాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన సినిమాలు, అంతకు ముందే దాదాపు పూర్తయిన సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలయ్యాయి. వెబ్ సిరీస్​లు వచ్చాయి. సినిమా హాళ్లు మూతపడటం వల్ల ఇంట్లో ఉండే టీవీలో ఓటీటీ ద్వారా కావాల్సిన సినిమాలు చూసే కొత్త అవకాశం ముంగిటకు వచ్చింది.

Special story on 2020 Review
కరోనాతో కుదేలైన సినిమా రంగం

మేకిన్​ ఇండియా..

కొవిడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తల బృందం ప్రభుత్వానికి సూచనలు చేసింది. మేకిన్ ఇండియా చొరవలను ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.

సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్యపరం చేయాలని, గ్రామీణుల ఆరోగ్య సంరక్షణ సమర్థంగా చేపట్టాలని కోరింది. దిగుమతులను తగ్గించాలని, కృత్రిమ మేధకు అవకాశమివ్వాలని, యువతకు నైపుణ్య శిక్షణను ప్రోత్సహించాలని, మెషిన్ లెర్నింగ్, డేటా ఎనలిటిక్స్ పై దృష్టి సారించాల్సి ఉందని సూచించింది.

ఉమ్మడి శత్రువుపై ఉద్ధృత పోరాటం..

మహమ్మారికి వ్యతిరేక యుద్ధంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై మోహరించాయి. కొవిడ్‌ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికై వ్యూహరచనకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ అసెస్​మెంట్ కౌన్సిల్‌ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థలు కరోనా వ్యాక్సిన్​ను తయారు చేస్తున్నాయి. వీటిలో చాలా టీకాలు క్లినికల్ పరీక్షలు పూర్తిచేసుకున్నాయి.

వలసకార్మికుల వెతలు

లాక్ డౌన్​తో నగరాల అష్ట దిగ్బంధనం. విమానాలు నిలిచాయి. రైళ్లు, బస్సులు ఆగిపోయాయి. మండుటెండలో కందిపోయే పాదాలతో ముందుకు సాగుతుంటే వారి కష్టానికి చలించారు మనసున్న మనుషులు.

ఎండ పడకుండా, పాదాలు కందిపోకుండా చంటిబిడ్డలను కంటిపాపల్లా కాపాడుతూ, గారాల బిడ్డలను గుండెలకు హత్తుకుని స్వగ్రామాలకు కదిలారు.

చావైనా, రేవైనా సొంతూరులోనే ఉంటాం. అంటూ సంపద సృష్టికర్తలైన వలస కార్మికులు కోటలు, పేటలు దాటి, నదీ నదాలు దాటుతూ.. దారికాని దారులలో, వేళకాని వేళలలో వలసజీవులు స్వస్థలాలకు బయలుదేరారు. వందల కిలోమీటర్ల నడక యాతన.. నరక యాతన, చిన్నపిల్లలని చంకనేసుకొని, తలమీద సామాన్లతో.. అడవులు, కొండలు, ఎడారులా మనకి అడ్డం అన్నట్లు వలస కార్మికులు ముందుకు సాగారు.

Special story on 2020 Review
లాక్​డౌన్​తో వలస కార్మికలు వెతలు

పురాణాల్లో శ్రావణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో వేసుకొని తీసుకెళ్లినట్లు.. కొందరు తమ ఇంటిపెద్దలను, చంటి బిడ్డల్నీ అలాగే తీసుకెళ్లారు.

బిహార్, ఒడిశా, ఛత్తీస్​గఢ్‌ నుంచి లక్షలాది కార్మికులు నెలలుగా స్వస్థలాలకు బయలుదేరారు. కుంభమేళాకు తరలే జన ప్రవాహాన్ని తలపించారు. ఆకలి తొలిచేస్తుంటే.. కొలువిచ్చిన ఊళ్లు తరిమేశాయి.

సోనూసూద్​ సాయం..

ఇదే సమయంలో మానవతా పరిమళం వెల్లివిరిసింది. దాతృత్వం ఉప్పొంగింది. వెండితెరపై ప్రతినాయకుడి పాత్రలు ధరించే సోనూసూద్‌ కష్టాలలో ఉన్న వలస కార్మికులకు అండగా నిలిచారు. కష్టాలలో ఉండి సాయం కోరిన వారందరినీ ఆదుకుని అభినవ దానకర్ణుడయ్యారు. ఆంధ్రావనిలో పొలం దున్నుతున్న ఇద్దరు కూతుళ్లు, తండ్రి కథ విని చలించారు. ట్రాక్టర్​ను బహూకరించారు. ఇటువంటి సాయాలు కోకొల్లలు.

వలస కార్మికులకు నేనున్నానంటూ ముందుకు వచ్చారు సోనూసూద్. వేలాది మంది వలస కార్మికులను బస్సులలో రాష్ట్రాలు దాటించి స్వగ్రామాలకు చేర్చారు.

ఆన్​లైన్​ ప్రచారం..

కరోనా కాలంలో వచ్చిన బిహార్ ఎన్నికలు ప్రచారానికి ఒక నమూనాను ఆవిష్కరించాయి. ఎన్నికల ప్రచారం, ప్రచార సభలు ఆన్​లైన్​లోనే జరిగాయి. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం తన వార్షిక మహానాడును ఆన్​లైన్​లో నిర్వహించింది. పార్టీల అంతరంగిక సమావేశాలు, సభలు, చర్చావేదికలు అన్నింటికీ ఆన్​లైన్‌ వేదికగా నిలిచింది.

కొవిడ్ కాలంలో ఆహారశుద్ధి పరిశ్రమలు ప్రాణం పోసుకున్నాయి. రోగనిరోధకత పెంచే ఆహారాలకు, కూరగాయలు, పండ్లకు గిరాకీ పెరిగింది. సుగంధ ద్రవ్యాల వినియోగం పెరిగింది. ప్రజలకు పొదుపు చేసేతత్వం అలవడింది. భవిష్యత్తు చింతన మొగ్గతొడిగింది.

వ్యవస్థలు పాతపద్ధతులు మార్చుకుని నవ్యతను ఆహ్వానించాయి. నవ్యసొగలులు అద్దుకున్నాయి. వ్యక్తులు మారిన కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకున్నారు.

శిరమెత్తింది యువతరం..

యువశక్తే మన కలిమి. బలిమి. జపాన్ లాంటి దేశాలు వృద్ధిరేటులో ముందున్నాయి. వృద్ధుల రేటులోనూ ముందున్నాయి. మనకు ఆ పరిస్థితి లేదు. ఇనుపనరాలతో, ఉక్కుకండరాలతో దేన్నయినా సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ఉన్న యువత మనబలం. మన గళం. యువత శిరమెత్తి ఘోషిస్తే నవలోకాలు ఆవిష్కారమవుతాయి. నిన్నటిలో జీవించటం మానేసి రేపటి కార్యాల గురించి ఆలోచన చేయాలి. "కాగల కార్యాలను ఏ గంధర్వులూ తీర్చరు. మనమే కాలాన్ని మధురాతిమధురంగా తీర్చిదిద్దుకోవాలి" అని పిలుపునిచ్చారు అలనాడు శ్రీశ్రీ. నూతన సంవత్సరం ఆగమన వేళ మానవాళికి ఈ మాటలు ఎప్పటికీ దిక్సూచిలా నిలుస్తాయి. వ్యక్తికి బహువచనం శక్తి అన్న ఆయన మాటల్ని నిజం చేయాలి. శ్రమ సమాజం నుంచే సమసమాజం.

Special story on 2020 Review
నూతన ఆవిష్కరణలవైపు యువత

జాతీయంగా, అంతర్జాతీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాం. అమెజాన్ ఒక ఆలోచన- ఆవిష్కారం. ఫ్లిప్ కార్ట్ ఒక ఆలోచన-ఆవిష్కారం. అలీబాబా ఒక ఆలోచన-ఆవిష్కారం. ఆలోచనను ఆచరణలో పెడితేనే అద్భుతాలు జరుగుతాయి. 2020లో ప్రపంచం అనూహ్యంగా మారింది. కృత్రిమ మేధ అన్ని రంగాలలో ప్రవేశించింది. మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే రోబోలు అన్ని రంగాలలో ప్రవేశించాయి.

కొవిడ్-19 సంక్షోభ కాలంలో రోబోలు కూడా అనేక రంగాలలో అత్యుత్తమ సేవలు అందించాయి. డిజిటల్‌ విప్లవం, ఇ-కామర్స్, ఇ-విద్య వైద్యాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విజ్ఞానం, సాంకేతికత, అల్గోరిథమ్‌, ఇన్ఫర్మేషన్, మానవుని నైపుణ్యం, జ్ఞానం సమాజాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లింది. భవిష్యత్తు నాలెడ్జి ఎకానమీదే. విద్యతోనే ఉత్పాదకత, సంపద సృష్టి సాధ్యం. గతంలో ఐటీ విప్లవం హవా నడిస్తే ఇప్పుడు ఐటీ ప్లస్ ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ జమానా నడుస్తోంది. యువతకు క్రియాశీలత అవసరం. యువకులే చోదక శక్తులు. దిశానిర్దేశకులు. నైపుణ్యాలు అందిస్తే వారు అద్భుతాలు ఆవిష్కరిస్తారు. దేశం రూపురేఖలే మారుస్తారు. భారతీయుల సత్తాను ప్రపంచానికి చాటిన జ్ఞాన భూమి, విజ్ఞాన భూమి మనది.

ఉత్తేజంతో ముందుకు సాగాలి..

ఏడాది జ్ఞాపకాల్లో మిగిలేవి, మిగుల్చుకోగలిగినవి కొన్నే ఉంటాయి. మంచి జ్ఞాపకాలు, మధురానుభూతులను ఉత్ప్రేకరంగా తీసుకుని ఉత్తేజంతో ముందుకు సాగాలి. సంక్షోభాలు శాశ్వతం కాదు. 2021 నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం. సంక్షోభంలోనే అవకాశాలు వెదుక్కొని ముందుకు సాగుదాం.

మరికొద్దిరోజుల్లో మన ముంగిటకు వచ్చే కరోనా టీకా మరింత భరోసానిస్తుందని మనందరి ఆశ, విశ్వాసం. పరీక్షలు మనకే. విజయాలూ మనవే.

ఆశానిరాశల మధ్య ఊగిన సంధికాలం 2020. ఇక మందగమనం వీడటం సత్యం. పరుగులు తీయటం తథ్యం. మనకోసం ప్రయోగశాలల్లో మానవతా మూర్తులు అహరహం పరిశోధన చేసి తయారు చేసిన టీకాలు వచ్చేస్తున్నాయి.

టీకా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వీడాలి. ప్రగతి రథం పరుగులు తీయాలి.

నేటి సంవత్సరం నిశిలో కలుస్తోంది. నూతన సంవత్సరం వచ్చేస్తోంది. అల్లరిగా లేచిపడే సముద్ర కెరటాలు ధీరగంభీరముద్రలో భానూదయానికి వినమ్రంగా స్వాగతిస్తున్నట్లు కాసేపు మౌనముద్రలో ఉంటాయి. కొత్త సంవత్సరంలో అందరూ మనఃపూర్వకంగా కోరుకుంటోంది విద్యార్థుల చదువులు బాగా సాగాలని.. కొలువులు భద్రంగా, ఆరోగ్యం దివ్యంగా ఉండాలని.. దేశం అభివృద్ధి పథాన నడవాలని.. పురోగమించాలనే.

గడిచే దినం, పొడిచే పొద్దు, నడిచే మనుషులు. కొత్త విశ్వాసాలు, కొత్త సంకల్పాలు, శపథాలు. కొత్త ఆశయాలు, జీవిత కాలాలు, జీవించిన కాలాలు, జీవించే కాలాలను కొలుచుకునే సమీక్షణమే నూతన సంవత్సర సంరంభం. ఇది శుభారంభం కావాలని మనఃపూర్వకంగా కోరుకుందాం.

తూరుపు సింధూరపు మందారం..

"వెన్నెలలో ఉదయరాగం.. హృదయగానం. సుందర సూర్యోదయం" అన్నారు సినారె. సూర్యోదయం మనకు ప్రకృతి అందించే నిత్యబహుమతి కాదా? విభాత సంధ్యల్లో జీవనసందేశం లేదా? ప్రతి రోజూ నూతనమే. అనునిత్యం సూర్యోదయం నూతనమే. నూతన సంవత్సరం మరీ నూతనం. వినూత్నం. మహాకవి చెప్పినట్లు "నరాల బిగువు, కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలి. అలాగే దేశ సౌభాగ్యం నిండాలి. కలలు పండాలి."

ఉమ్మడి శత్రువు ఇంకా తిష్టవేసే ఉన్నాడు కాబట్టి నిర్దేశిత హద్దుల్లో, జాగ్రత్తలతో ఉంటూనే భౌతిక దూరాలు పాటిద్దాం. స్వీయరక్షణే శ్రీరామరక్షగా భావించి అప్రమత్తతను కొనసాగిద్దాం. ముఖ కవచాలను మరికొంత కాలం కొనసాగిద్దాం. కరచాలనాలను ఇంకొంతకాలం వాయిదావేసి మన సంస్కార సంకేతమైన నమస్కారంతోనే పలకరిద్దాం. కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం.. అభినందిద్దాం.. ఆనందిద్దాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.