ETV Bharat / bharat

''బాబ్రీ' కేసులో కోర్టు తీర్పు.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం'

బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పుపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. కోర్టు తాజా నిర్ణయం.. సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు కాంగ్రెస్​ పార్టీ ప్రధాన ప్రతినిధి రణ్​​దీప్ సుర్జేవాలా.

Special court verdict in Babri case runs counter to SC judgement, constitutional spirit: Cong
'బాబ్రీ కేసులో కోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం'
author img

By

Published : Sep 30, 2020, 5:02 PM IST

Updated : Sep 30, 2020, 5:13 PM IST

వివాదాస్పద బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన నేటి తీర్పును విమర్శించింది కాంగ్రెస్​. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా అన్నారు. మతతత్వ సఖ్యత, సోదరభావం, రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు.. ఈ తీర్పునకు వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలు చేయాలని కోరారు సుర్జేవాలా.

"బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగినట్లు గతేడాది నవంబర్​ 9న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరనీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం" అని సుర్జేవాలా విమర్శించారు.

"దేశవ్యాప్తంగా లోతుగా పాతుకుపోయిన భాజపా, ఆర్​ఎస్​ఎస్​లు రాజకీయ కుట్రలకు ఈ తీర్పు సాక్ష్యం. దేశంలోని సోదరభావం, మతతత్వ స్నేహాన్ని నాశనం చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు."

- రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి

బాబ్రీ మసీదు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా అగ్ర నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మందిని నిర్దోషులుగా తేల్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

ఇదీ చూడండి: బాబ్రీ తీర్పును స్వాగతించిన ఆర్ఎస్​ఎస్​

Last Updated : Sep 30, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.