2016లో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహాన్ని తలపించేలా ఉన్నాయని దాఖలైన పిటిషన్ను ఎంపీల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది దిల్లీ కోర్టు. ఈ వ్యాజ్యంపై ఈనెల 26న విచారణ జరగనుంది.
దిల్లీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలా మాట్లాడడం దేశద్రోహమే అవుతుందని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో కేసు దాఖలైంది. రాహుల్పై దేశద్రోహం కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ప్రజాప్రతినిధుల కేసుల కోసం దిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టు ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది.
ఇదీ చూడండీ: బిల్కిస్ బానోకు అర కోటి పరిహారం, ఉద్యోగం