సభాపతి నిర్ణయాలను సభ వెలుపల ప్రశ్నించడం సరికాదని రాహుల్ గాంధీపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. చేపల శీతల గిడ్డంగులపై అనుబంధ ప్రశ్నలు అడగడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్సభలో అవకాశమివ్వలేదు స్పీకరు. దీనిపై రాహుల్... సభ వెలుపల స్పీకర్ నిర్ణయంపై విమర్శలు చేశారు.
ప్రశ్నోత్తరాల సమయంలో శీతల గిడ్డంగులపై చర్చ జరిగింది. అప్పటికే ప్రతిపక్షాలు పలు అనుబంధ ప్రశ్నలు అడిగారు. ఒక్క అంశంపైనే ఎక్కువ చర్చ జరగడం వల్ల సమయం వృథా అవుతుందని భావించిన సభాపతి.. ఇంకో అంశంపై ప్రశ్నలకు అనుమతించారు.
''ప్రశ్నలు, సమాధానాలు చిన్నవిగా ఉండాలని చెబుతూనే ఉన్నా. ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది కావాలనే అనుబంధ ప్రశ్నలు అడిగారు. ఒక ప్రశ్నకు 15 నుంచి 20 నిమిషాలు సమయం పడుతోంది. అలాంటప్పుడు మధ్యాహ్నం 12గంటల తర్వాత అనుమతించడం సరికాదు.''
- ఓం బిర్లా, లోక్సభ స్పీకర్
ఇదీ చూడండి: 'నేను చెప్పేది ఎవరూ పట్టించుకోరు ఎందుకు?'