ETV Bharat / bharat

ఆ 22 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్​ నోటీసులు

మధ్యప్రదేశ్​ రాజకీయం సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. 22 మంది కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్​ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లోపు తన ముందు హాజరై, రాజీనామాలకు గల కారణాలను వెల్లడించాలని ఆదేశించారు. రాజీనామాలకు స్పీకర్​ ఆమోదం తెలిపితే.. కమల్​నాథ్​ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.

Speaker issues notices to 22 rebel MLAs
ఆ 22 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్​ నోటీసులు
author img

By

Published : Mar 12, 2020, 4:31 PM IST

Updated : Mar 12, 2020, 6:59 PM IST

ఆ 22 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్​ నోటీసులు

మధ్యప్రదేశ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీకి చెందిన 22 మంది రెబల్​ ఎమ్మెల్యేలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్​ ఎన్​పీ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లోపు తన ముందు హాజరుకావాలని ఆదేశించారు. తమ పదవికి స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారా, లేక ఎవరి ఒత్తిడి వల్లనైనా ఈ విధంగా చేశారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

భాజపా వ్యూహాలకు పదును...

ప్రతిపక్ష భాజపా అధికార పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలని డిమాండ్​ చేస్తోంది. ఈనెల 16న విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్​ను కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

"ప్రస్తుతం ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈనెల 16న రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా అదే రోజు బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్​, అసెంబ్లీ స్పీకర్​ను కోరనున్నాం. గవర్నర్​, స్పీకర్​ వద్ద 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఉన్నాయి. ఏమి నిర్ణయం తీసుకుంటారనేది వారి ఇష్టం."

- నరోత్తమ్​ మిశ్రా, భాజపా ​విప్​.

22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం వెలువడిన తర్వాత విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమని కాంగ్రెస్​ స్పష్టం చేసింది.

స్పీకర్​ నిర్ణయంపైనే ఆధారం..

15 నెలల కమల్​నాథ్​ ప్రభుత్వం.. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో పడింది. పార్టీ నేత జోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​కు రాజీనామా చేసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కాషాయ పార్టీలోకి వెళ్తారని అనుకున్నప్పటికీ అలా జరగలేదు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్​ అసెంబ్లీలో ప్రస్తుతం 228 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్​ 114, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ సభ్యుల బలం ఉంది. భాజపాకు 107 స్థానాలు ఉన్నాయి. అయితే 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే.. కాంగ్రెస్​ బలం 92 స్థానాలకు పడిపోయి ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది.

ఇదీ చూడండి: కమల్​నాథ్​ సర్కార్​ భవితవ్యం తేలేది ఆరోజే...

Last Updated : Mar 12, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.