ఉగ్రదాడులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో పారామిలటరీ, దిల్లీ ప్రధాన కార్యాలయం ఈ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (ఎస్వోపీస్) అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక వాహనాల కోసం రూపొందించిన ఈ "ప్రయాణికుల (సైనికుల) క్రమశిక్షణ ప్రణాళిక"ను కచ్చితంగా పాటించాలని నిర్దేశించింది.
ఇదీ చూడండి:భారత్ భేరి : మోదీకి జై... యడ్డీకి నై...!
ఇప్పటి వరకు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జూనియర్ అసిస్టెంట్ కమాండెంట్ (అసిస్టెంట్ ఎస్పీ) స్థాయి ఆధ్వర్యంలో నడిచేది. కొత్త నిబంధన ప్రకారం ఇకపై సెకెండ్ ఇన్ కమాండెంట్ (ఎస్పీ) స్థాయి అధికారి ఆధ్వర్యంలో కాన్వాయ్ నడుస్తుంది. ఇప్పుడు జారీ చేసిన నూతన నిబంధనల వల్ల భద్రతా చర్యలు మరింత పటిష్టం కానున్నాయి.
ఇదీ జరిగింది
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ జవానులు ప్రయాణిస్తున్న వాహనాలపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ సమయంలో 78 వాహనాలు ఒకేసారి ప్రయాణిస్తున్నాయి. దాడిలో 40 మందికి పైగా భారత జవానులు అసువులు బాసారు.
ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌లో జైష్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి నాశనం చేసింది. ప్రతిగా పాక్ భారత భూభాగంపై వైమానిక దాడికి పాల్పడింది.
ప్రస్తుతానికి దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టినా, పాక్ తరచుగా నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. కశ్మీర్లో ఉగ్రకార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం పటిష్ట భద్రతా చర్యలకు ఉపక్రమించింది.