ETV Bharat / bharat

భారత్​లో సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం: సోనియా

author img

By

Published : Oct 19, 2020, 5:06 AM IST

రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్విర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ నాయకులకు సోనియా సూచించారు. ఈ మేరకు ఆమె ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యం సంక్లిష్ట దశలో ఉందని అన్నారు.

CONG-SONIA-MEETING
సోనియా

దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్​ఛార్జిల సమావేశంలో ప్రసంగించిన సోనియా.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్దమైన బాధ్యతలను నిర్విర్తించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.

కరోనా కట్టడిలో విఫలమయ్యారని, ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, దళితులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు సోనియా. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార వాటాను ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోందని, పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏవిధంగా సహాయం చేయగలవని ప్రశ్నించారు సోనియా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

"తోటి భారతీయులు, కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రమించి నిర్మించిన భారత ఆర్థిక వ్యవస్థను భాజపా ప్రభుత్వం ఏకకాలంలో కూల్చి వేసింది. దేశ జీడీపీ ఇంతగా దిగజారడం చరిత్రలోనే లేదు. ఈ రోజు యువతకు ఉద్యోగాలు లేవు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చి వారిపై కోలుకోలేని దెబ్బ వేసింది. హరిత విప్లవం’ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రే ఇది. దీని ప్రభావం కోట్లాది మంది రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులపై పడుతుంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ధర్నాలు.. సత్యాగ్రహాలు..

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలు సహా పార్టీ భవిష్యత్‌ కార్యచరణ గురించి చర్చించినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ బిల్లులు, దేశంలో దళితులపై జరుగుతున్న అత్యాచారాలు తదితర అంశాలపై వరుసగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

  • సర్ధార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి, ఇందిరా గాంధీ వర్ధంతి రోజైన అక్టోబర్​ 31న 'కిసాన్​ అధికార్​ దివస్​'గా నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో వ్యవసాయ, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సత్యాగ్రహం, ఉపవాస దీక్షలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
  • నవంబర్​ 5న 'మహిళలు, దళితులపై అత్యాచారాల నిరోధ దివస్​'గా జరపాలని, ఆ రోజున ప్రతి రాష్ట్రంలోని పార్టీ ప్రధాన కార్యాలయాల్లో ధర్నా నిర్వహించనున్నారు.
  • మాజీ ప్రధాని జవహార్​ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఆన్​లైన్​ ప్రచారం నిర్వహించనుంది కాంగ్రెస్.

ఇదీ చూడండి: ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు ఉద్యమించాలి: సోనియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.