ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నామినేషన్ వేయనున్నారు. రాయ్‌బరేలీలో మే 6న సార్వత్రిక ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరగనుంది.
2004 నుంచి సోనియాగాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్నారు. 2006 ఉపఎన్నికలు, 2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఆమె విజయఢంకా మోగించారు. ప్రస్తుతం ఆమె.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి భాజపా తీర్థం పుచ్చుకున్న దినేష్ ప్రతాప్ సింగ్‌తో పోటీపడుతున్నారు.
కాంగ్రెస్‌కు పోటీగా.. రాయ్‌బరేలీలో తమ అభ్యర్థిని నిలపబోమని ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటించింది.
1957 నుంచి రాయ్‌బరేలీలో 19 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. కేవలం 3 సార్లు మాత్రమే (1977, 1996, 1998) ఓటమి చవిచూసింది.
ఇదీ చూడండి: భారత్ భేరి: సమరానికి సర్వం సిద్ధం