ETV Bharat / bharat

'వారికి 21 రోజుల ముందస్తు వేతనాలు చెల్లించండి' - కరోనా మరణాలు

లాక్​డౌన్​ వల్ల పనులు కోల్పోయిన ఉపాధి హామీ కూలీలకు 21 రోజుల ముందస్తు వేతనాలు చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

Sonia Gandhi asks PM to give 21 days' wages in advance to MGNREGA workers
'వారందరికీ 21 రోజుల ముందస్తు వేతనాలు చెల్లించండి'
author img

By

Published : Apr 1, 2020, 5:50 PM IST

లాక్​డౌన్​ కారణంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునేలా.. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానికి లేఖ రాశారు. వారికి 21 రోజుల వేతానాలు ముందస్తుగా చెల్లించాలని కోరారు.

గ్రామాల్లో నివసిస్తోన్న పేదలు లాక్​డౌన్​​ వల్ల ఉపాధి కోల్పోయారు. సుమారు 8 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లేవు. వీరందరికీ తక్షణమే సాయం అందించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.

సోనియా గాంధీ, కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు

దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో.. మాహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం(ఎంజీఎన్​ఆర్​ఈజీఏ) ప్రారంభమైందని.. అప్పటి నుంచి గ్రామీణ పేదలకు చేయూతగా నిలిచిందని సోనియా తెలిపారు. కీలకమైన పంటకోత సమయంలో లక్షలాది మంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.