ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా ఇళ్లలోనే ఉండి, సాయంత్రం చప్పట్లు కొట్టి కరోనా కోసం పోరుడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే ప్రజలను కోరారు. ఈ సమయంలో తాము కూడా మోదీ సూచించినట్లే చప్పట్లు కొడతామని, అనంతరం సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా బాల్కనీల్లో బ్యానర్లు ప్రదర్శిస్తామని చెబుతున్నారు దిల్లీ వాసులు. ఈ మేరకు యునైటెడ్ అగైనస్ట్ హేట్ సంస్థ సభ్యులు ప్రకటనలో పేర్కొన్నారు.
" కరోనా సోకిన వారికి సాయం చేస్తున్న మా సోదరులు, సోదరీమణులుకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుతాం. అనంతరం ఎన్ఆర్సీ, సీఏఏలను వ్యతిరేకంగా బాల్కనీలు, కిటికీల నుంచి బ్యానర్లు ప్రదర్శించి ఏప్రిల్ 1నుంచి ప్రారంభం కానున్న జాతీయ జనాభా పట్టిక నమోదను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 9గం. వరకు ఇళ్లలోనే ఉండాలని మోదీ వినతి చేస్తున్నారు.. దిల్లీ అలర్లలో ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తాం."
-నదీమ్ ఖాన్, దిల్లీ వాసి.
దిల్లీ అల్లర్లలో నివాసాలు కోల్పోయిన 1200మంది ముస్తాఫాబాద్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరో దిల్లీ వాసి ఇర్కాన్ చౌదరి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని మోదీ చెబుతున్నారు, మరి ఇళ్లు లేని వారి పరిస్థితి ఏంటని, ప్రశ్నిస్తున్నాడు.
ఇదీ చూడండి: 'చిన్నచిన్న జాగ్రత్తల విలువ.. ఎంతోమంది ప్రాణాలు'