తలసరి స్థూల జాతీయోత్పత్తిలో భారత్‌కు దాదాపు సమానంగా బంగ్లాదేశ్ వస్తోందన్న ఐఎమ్ఎఫ్ అంచనాలను ఆసరాగా చేసుకుని కేంద్రంపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆరేళ్లలో సాధించిన ప్రగతి ఇదేనంటూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
" జీడీపీలో త్వరలో భారత్‌ను బంగ్లాదేశ్ అధిగమించనుంది. ఇది 6 సంవత్సరాల భాజపా విద్వేషపూరిత జాతీయవాద రాజకీయాల ఫలితమే."
----రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఐఎమ్ఎఫ్ ఏం చెప్పింది?
భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎమ్ఎఫ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక రంగం కుదేలైందని పేర్కొంది. ఈ సంవత్సరం గణనీయంగా 10.3శాతం మేర ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని అంచనా వేసింది.
వచ్చే సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ఐఎమ్ఎఫ్ పేర్కొంది. 8.8 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది.
ఇదీ చదవండి :నిధుల కొరతతో కోమాలో దేశారోగ్యం