ETV Bharat / bharat

దిల్లీలో దుమ్ముపడుతున్న జాకెట్లు- చలితో సైనికుల పోరాటం

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. నియంత్రణ రేఖ వెంట, అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో గడ్డకట్టించే చలిలో బలగాలను మోహరించింది భారత సైన్యం. వారిప్పుడు చలితో పోరాటంలో కావాల్సిన జాకెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. క్లిష్టమైన ప్రదేశాలుగా ఉన్న సియాచిన్, డోక్లాం, లద్దాఖ్​లలో సైనికులకు సరైన సదుపాయాలు, కావాల్సిన ఆహారం అందించటంలో అనేక లోపాలు ఉన్నాయని వెల్లడించింది కంప్ట్రోలర్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్) నివేదిక. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.

Soldiers shiver in Ladakh
శీతాకాలంలో వణుకుతున్న సైనికులు.. సదుపాయాల కల్పనలో సవాళ్లు ?
author img

By

Published : Oct 19, 2020, 1:15 PM IST

Updated : Oct 19, 2020, 1:20 PM IST

హిమాలయాల సరిహద్దులో శీతాకాలం ముంచుకొచ్చింది. గడ్డకట్టించే చలిలో గస్తీ కాయాలంటే సైన్యానికి ప్రత్యేక జాకెట్లు అవసరం. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు రేఖ వెంట, అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో బలగాల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, వారికి ప్రస్తుతం అత్యవసరమైన 15,000 జాకెట్లు.. గత 15రోజులుగా దిల్లీలోని ఆర్డినెన్స్​ డిపోలో పోగుపడి ఉన్నాయి.

ప్రత్యేక జాకెట్లకు ఆర్డర్​

ఓవైపు సరిహద్దు ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. భారత్​-చైనాల మధ్య పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో హై-ఆల్టిట్యూడ్ క్లోతింగ్​ అండ్​ ఎక్విప్​మెంట్ (హెఏసీఈ) .. 30,000 ప్రత్యేక జాకెట్ల తయారీకి అమెరికాకు చెందిన సంస్థకు ఆర్డరిచ్చింది.

అత్యున్నత వర్గాల సమాచారం మేరకు.. ఈ ఒప్పందం కొన్నిరోజుల్లోనే ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత్యవసరంగా ఇవి కావాల్సిన నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా.. 15,000జాకెట్లు అక్టోబర్​ 2నే భారత్​ చేరుకున్నాయి. కానీ, 15రోజులుగా అవి దిల్లీలోని భాండాగారంలోనే ఉన్నాయని, సైనికులు వీటి కోసం ఎదురుచూస్తున్నారని.. ఈటీవీ భారత్​కు వివరించారు.

ఇదే విషయంపై సైనిక ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. వారి సమాధానం వేరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం సరిహద్దులో సరిపడా ఉన్నాయని, అంత అత్యవసరం లేదని అంటూనే.. త్వరలోనే వీటిని లద్దాఖ్​ చేరుస్తామని చెబుతున్నారు.

కాగ్​ నివేదిక..

ఈ ఏడాది విడుదల చేసిన కాగ్ నివేదిక.. సరిహద్దు సైనిక సదుపాయలకు సంబంధించి కీలక విషయాలు వివరించింది. సియాచిన్, డోక్లాం, లద్దాఖ్​లలో సైనికులకు సరైన సదుపాయాలు, కావాల్సిన ఆహారం అందించటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించింది. సైనికులు దూరప్రాంతాలను స్పష్టంగా చూడగలిగేలా.. ఎక్స్​ట్రీమ్​ కోల్డ్ క్లోతింగ్​ ఎండ్​ ఎక్విప్​మెంట్​ (ఈసీసీఈ) విభాగానికి చెందిన, 'ఆల్ టెర్రైన్​ గాగుల్స్'​ వినియోగిస్తారు. పహారాలో కీలకంగా నిలిచే వీటి లభ్యత 5.6% నుంచి 16.07%కు మాత్రమే పెరిగింది. పేలవమైన సరఫరా కారణంగా కావాల్సినదాని కంటే, అందుబాటులో ఉన్నవి తక్కువగా ఉన్నాయని తేల్చింది కాగ్​.

కీలకం కానున్న కొత్త జాకెట్లు !

మరోవైపు ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఎల్​ఏసీ వెంట దాదాపు -25డిగ్రీల కిందకు పడిపోయినా.. సైనికులు తమ తాత్కాలిక గుడారాల్లోనే చలితో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి తీసుకొచ్చిన ఈ జాకెట్లు కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు. మూడు పొరలతో, ఒక హుడీ... అలాగే తక్కువ బరువుతో ఉండే ఈ జాకెట్లు గాలిలో ఆక్సిజన్ క్షీణించిన ప్రాంతాలలో చాలా కీలకంగా ఉంటాయి.

ఈ జాకెట్లలో లోపలోభాగం.. ఉన్నితో ఉంటుంది. వెలుపల పాలిస్టర్​తో ఉంటుంది. బరువు సైతం 2.5కిలోలకు మించదు. ఈ థర్మల్ దుస్తులు నీటిలో తడవవు. విపరీతమైన చలిని, చలిగాలులను ఎదుర్కోవటానికి అనువైనవి. ఈ ప్రత్యేక జాకెట్లు ఒకేసారి.. ఒక సైనికుడికి ఇస్తారు. పునర్వినియోగించే అవకాశం ఉండదు.

సరఫరా విభాగాలు..

ప్రస్తుతం ఎల్​ఏసీ వెంట.. దాదాపు 50,000మంది సైనికులు ఉన్నారు. ఏప్రిల్-మే నుంచి భారత్​-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. చల్లారడం లేదు. మొదట్లో ఈ ప్రాంతంలో సైనికులు, సామగ్రి రెండింటి సరఫరా తక్కువగా ఉండేది. ఇవి వేగంగా విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న హెచ్ఏసీఈ ఆధ్వర్యంలో ఎక్స్​ట్రీమ్​ కోల్డ్ క్లోతింగ్​ ఎండ్​ ఎక్విప్​మెంట్​ (ఈసీసీ&ఈ) అలాగే, స్పెషల్​ క్లోతింగ్​ అండ్​ మౌంటెనీరింగ్​ ఎక్విప్​మెంట్ (ఎస్​సీఎంఈ) విభాగాలు ఇందుకోసం పని చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈసీసీఈ వస్తువులు సామాగ్రి తూర్పు కమాండ్​లో 9,000అడుగుల ఎత్తులో మోహరించిన సైనికులకు, ఇతర కమాండ్​లలో 6,000 అడుగుల ఎత్తులో పహారా కాస్తున్న బలగాలకు అందిస్తారు. ఎస్​సీఎంఈ.. వస్తువులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న సైనికులకు అందజేస్తారు. గతంలో సియాచెన్​ బలగాలకు ఇచ్చేవారు. ఇప్పుడు తూర్పు లద్దాఖ్​లోని బృందాలకు ఇస్తున్నారు.

-సంజీవ్​ బారువా

Last Updated : Oct 19, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.