పుల్వామా ఘటన అనంతరం జవాన్ల భద్రతపై చర్యలు చేపట్టింది కేంద్రం. 30 మంది ప్రయాణించే వీలుతో, ల్యాండ్మైన్లను తట్టుకునే సామర్థ్యం కలిగిన బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ భట్నాగర్ ప్రకటన విడుదల చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించే బాంబ్ డిటెక్షన్ పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. బుల్లెట్ ప్రూఫ్ ఉన్న పెద్ద బస్సుల లభ్యత తక్కువ. వాటి తయారీ కష్టం. అందుకే 30 మంది ప్రయాణించటానికి అనువుగా ఉండే చిన్న బస్సుల వైపు మొగ్గు చుపాం.- భట్నాగర్, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్
సీఆర్పీఎఫ్ బలగాల వద్ద బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని నక్సల్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతంలోనూ, మిగతా వాటిని జమ్ముకశ్మీర్లో వినియోగిస్తున్నారు. వీటిలో నలుగురు మాత్రమే ప్రయాణించటానికి వీలుంది.
అయితే ఈ వాహనాలు తీవ్రవాదుల కాల్పుల నుంచి మాత్రమే జవాన్లను రక్షించగలవు. పుల్వామా లాంటి దాడుల నుంచి కాపాడలేవని సీనియర్ సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దాడుల నుంచి తప్పించుకోవటానికి సమగ్ర విధానం ఒకటి రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
సమగ్ర విధానమిదే
⦁ జవాన్ల వాహనాలు ప్రయాణించే సమయంలో ఆ ప్రాంతంలో సాధారణ పౌరుల గమనంపై నిషేధం.
⦁ జవాన్ల వాహనాల హాల్టింగ్ పాయింట్లు తరచుగా మార్చటం.