భౌతికదూరం నిబంధనలను పర్యవేక్షించడానికి ఖరగ్‌పుర్ ఐఐటీ పరిశోధకులు 'సైబర్-ఫిజికల్' వ్యవస్థను రూపొందించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా తయారైన ఈ సాధనం చాలా చౌకైందని పరిశోధకులు తెలిపారు. ఇది వ్యక్తుల మధ్య దూరాన్ని గుర్తిస్తుందని చెప్పారు.'
'భౌతిక దూరానికి సంబంధించిన నిబంధనను ఉల్లంఘించినప్పుడల్లా ఇది అప్రమత్తత శబ్దాలను చేస్తుంది. పరిసరాలను చిత్రీకరించి, అందులో వ్యక్తుల మధ్య దూరాలను లెక్కిస్తుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రమాణాలకు అనుగుణంగా పని చేస్తుంది' అని పరిశోధకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: జియోలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
ఇదీ చూడండి: 'ఒకే సరిహద్దు- ఒకే సైన్యం విధానం మనకూ అవసరం'