ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్‌లో నిరవధికంగా మంచు వర్షం కురుస్తోంది. సముద్రమట్టానికి 3584 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ధామ్‌లో భారీ హిమపాతం నమోదైంది. సుమారు 8 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. హిమ పర్వత అందాలు కనువిందు చేస్తున్నా.. స్థానికులకు మాత్రం ప్రాణగండంగా మారింది.
మంచు కారణంగా ఇప్పటికే కేదార్నాథ్ క్షేత్రంలో అన్ని పూజా కార్యక్రమాలు నిలిపివేశారు. విద్యుత్తు, సమాచార సేవలూ నిలిచిపోయాయి.
కూలీల ఇక్కట్లు..
ధామ్‌లో శంకరాచార్య సమాధి స్థలం, ఘాట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మైనస్ 12 డిగ్రీల ఉష్టోగ్రత వద్ద.. ఆలయంలో ఉన్న కూలీలు చలికి వణికిపోతున్నారు. ఈ కారణంగా నిర్మాణ పనులూ నిలిచిపోయాయి.
రక్తం గడ్డకట్టే చలికి 12 మంది కార్మికులు ధామ్ నుంచి వెళ్లిపోగా.. మరో 11 మంది క్షేత్రంలోనే ఉండిపోయారు. వీరు కనీసం మంచి నీరు తాగాలన్నా.. మంచును కరిగించి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి:'లింగ వ్యత్యాస సూచీ'లో మరింత కిందకు భారత్