ETV Bharat / bharat

గుజరాత్​లో పామును కరిచి చంపిన వ్యక్తి..!

గుజరాత్​లో ఓ వ్యక్తి కరవడం వల్ల పాము మృతి చెందింది. ఈ ఘటన అజాన్వ గ్రామంలో జరిగింది. అనంతరం పాము కాటుకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుజరాత్​లో పామును కరిచి చంపిన వ్యక్తి!
author img

By

Published : May 6, 2019, 11:13 PM IST

'పాము కాటుకు మనిషి మృతి' అనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. కానీ 'మనిషి కరవడంతో పాము మృతి' అనే వార్త ఎప్పుడైనా విన్నారా? అసలు ఇది సాధ్యమే కాదనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్టే....

గుజరాత్​లో శనివారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మనిషి కరవడం వల్ల సర్పం మృతి చెందింది. అజాన్వ గ్రామానికి చెందిన పర్వత్​ గాల బరియా అనే వ్యక్తిని పాము కాటేసింది. ఆగ్రహంతో పర్వత్​ పామును కరిచాడు. ఈ ఘటనలో పర్వత్​తో పాటు పాము కూడా మృతి చెందింది.​ ఈ విషయాన్ని గ్రామ సర్పంచి వివరించారు.

"పొలంలో మొక్కజొన్నను లారీలోకి ఎక్కిస్తోన్న సమయంలో ఓ పాము బుసలు కొడుతూ అటువైపు వచ్చింది. అందరం పరిగెత్తాం. కానీ పర్వత్​ అక్కడే ఉండిపోయాడు. పాములను పట్టుకోవడం తనకు అలవాటే అని అన్నాడు. ఆ సర్పం పర్వత్​ ముఖంపై, చేతిపై కాటేసింది. పర్వత్​ కూడా పామును కరిచాడు."
- కను బరియా, సర్పంచ్​

స్థానికులు పర్వత్​ను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం గోద్రాలోని పెద్దాసుపత్రికీ తీసుకెళ్లారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ఐఐటీ మద్రాస్​ సెమిస్టర్​ పరీక్షలో ధోనీపై ప్రశ్న

Amethi (UP), May 06 (ANI): People of Tendua village in Amethi district of Uttar Pradesh were disappointed as their names went missing from voters' list at booth number 374 And 375 in the primary school. Villagers claimed that their names were present in the voter list for the previous Gram Sabha Elections but this time almost 50 percent of the voters' name went missing from the list. A local from the village said that there are six people in his family but only two got the right to vote this time.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.