దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 10 శాతం కన్నా తక్కువ కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీలు 67 లక్షలకు పెరిగి.. రికవరీ రేటు 88.63శాతానికి చేరినట్లు వివరించింది.

దేశంలో ఇఫ్పుడు 7,48,538 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల్లో ప్రస్తుత యాక్టివ్ కేసులు 9.85 శాతం మాత్రమే.
కరోనా నుంచి కోలుకున్నవారు అత్యధికంగా, మరణాల రేటు భారత్లోనే తక్కువని ఆరోగ్య శాఖ వెల్లడిచింది. దేశంలో కొవిడ్-19 మరణాల రేటు 1.52 శాతంగా ఉన్నట్లు వివరించింది.


అత్యల్పంగా కొత్త కేసులు..
కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం నాటికి.. దాదాపు మూడు నెలల తర్వాత 50 వేల కన్నా తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. చివరగా జులై 28న.. తక్కువగా 47,703 కేసులు నమోదవ్వడం గమనార్హం.
ఇదీ చూడండి:దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు