ETV Bharat / bharat

'మరో నాలుగు రోజుల్లో భారత్​-చైనా కీలక సమావేశం' - భారత్​ చైనా సరిహద్దు ఉద్రిక్తత

భారత్​-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ తరుణంలో రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తూర్పు లద్దాఖ్​లో చైనా భారీ సంఖ్యలో దళాలను మోహరించిందని వెల్లడించారు. అయితే భారత్​ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుందని స్పష్టం చేశారు రక్షణమంత్రి.

Sizeable number of Chinese troops moved into eastern Ladakh: Rajnath Singh
'సరిహద్దు వద్ద భారీ సంఖ్యలో చైనా దళాలు'
author img

By

Published : Jun 2, 2020, 9:45 PM IST

తూర్పు లద్దాఖ్​లో భారీ సంఖ్యలో చైనా సైన్యాన్ని మోహరించినట్టు భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. ఈ విషయంలో భారత్​కు కూడా చర్యలను ముమ్మరం చేసిందని వెల్లడించారు. నెల రోజులుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజ్​నాథ్​ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈనెల 6న సమావేశం

భారత్​-చైనా మిలిటరీ అధికారుల మధ్య ఈ నెల 6న సమావేశం జరగనుందని రాజ్​నాథ్​ తెలిపారు. అయితే ఈ విషయంలో భారత్​ వెనకడుగు వేయదని తేల్చి చెప్పారు.

"తూర్పు లద్దాఖ్​లోని అతి సున్నితమైన ప్రాంతాలు తమకు చెందినవని చైనా అంటోంది. కానీ అవి మనవేనని భారత్​ విశ్వసిస్తోంది. ఈ విషయంపై ఇరు వర్గాలు ఓ అంగీకారానికి రాలేకపోయాయి. భారీ సంఖ్యలో చైనీయులు అక్కడికి వచ్చారు. భారత్​ చేయాల్సింది చేసింది."

--- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి.

ఈ విషయాన్ని చైనా తీవ్రంగా పరిగణించి సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని రక్షణమంత్రి పేర్కొన్నారు.

ఇదీ జరిగింది...

మే 5న తూర్పు లద్దాఖ్​లో చైనా, భారత్​ సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుదేశాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో 100 మందికిపైగా గాయపడ్డారు. అనంతరం మే 9న ఉత్తర సిక్కిం వద్ద ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. నకులా పాస్​ వద్ద జరిగిన ఈ ఘర్షణలో రెండు దేశాలకు చెందిన 10 మంది సైనికులు గాయపడ్డారు. అప్పట్నుంచి చైనా-భారత్​ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.