బిహార్ గోపాల్గంజ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు క్షతగాత్రులయ్యారు.
ఇదీ జరిగింది...
సామర్థ్యానికి మించిన పాలరాతి రాళ్ల లోడుతో ఓ లారీ బిహార్ గోపాల్గంజ్ జిల్లాలో సారియా నరేంద్ర గ్రామం మీదుగా ప్రయాణిస్తోంది. అదే సమయంలో రోడ్డు పక్కన గొర్రెలు కాసుకుంటున్న కొంతమంది పిల్లల నిలబడ్డారు. రహదారిపై గుంతల కారణంగా లారీ అదుపుతప్పి, పిల్లలపై అమాంతం పడిపోయింది. డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సహాయ చర్యలు చేపట్టారు. అప్పటికే ఆరుగురు పిల్లలు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి : వైరల్: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో నరికి హత్య