ఒడిశాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
20 జిల్లాల్లోని 14 లక్షల 32 వేల మందిపై వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి. 10వేల 382 ఇళ్లు దెబ్బతిన్నాయి. విపత్తు నిర్వహణ ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి.
ఇదీ చూడండి: ఉప్పొంగిన 'మహానది'- ఒడిశా జలమయం!