ETV Bharat / bharat

నిర్మల నయా ట్రెండ్​- 'ట్యాబ్'​తో బడ్జెట్​ - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

2021-22 బడ్జెట్​ ప్రవేశపెట్టే క్రమంలో మరో కొత్త సంప్రదాయానికి తెరతీశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ప్రతుల ముద్రణ లేనందున.. ఎర్రటి పౌచ్​లో ట్యాబ్​తో పార్లమెంట్​కు చేరుకున్నారు. డిజిటల్​ పద్ధతిలోనే బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

Finance minister Nirmala
నిర్మల నయా ట్రెండ్​- 'ట్యాబ్'​తో బడ్జెట్​
author img

By

Published : Feb 1, 2021, 9:50 AM IST

Updated : Feb 1, 2021, 9:57 AM IST

వార్షిక బడ్జెట్​ ప్రతులను సూట్​కేస్​లో తీసుకొచ్చే సంప్రదాయానికి స్వస్తి పలికిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ఈసారి ఎర్రటి రంగు పౌచ్​లో ట్యాబ్​తో పార్లమెంట్​కు వచ్చారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్​ ప్రతుల ముద్రణ లేనందున ట్యాబ్​ ద్వారా డిజిటల్​ పద్ధతిలో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

Finance minister Nirmala
ట్యాబ్​ను చూపుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

ఎన్డీఏ సర్కారు 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిసారి బడ్జెట్​ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​.. సూట్​కేస్​ సంప్రదాయానికి తెరదించుతూ.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏడాది 2020లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈసారి కరోనా నేపథ్యంలో.. ఎర్రటి వస్త్రానికీ స్వస్తిపలికి అదే రంగులోని పౌచ్​లో ట్యాబ్​ను తీసుకొచ్చారు.

Finance minister Nirmala
ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద నిర్మలా సీతారామన్​

సూట్​కేస్​ చరిత్ర ఇదీ..

బడ్జెట్​ను ఫ్రెంచ్​ భాషలో బోగెటి అంటారు. దీని ఇంగ్లీష్​ అర్థమే లెదర్​ బ్యాగ్​. 1860లో బ్రిటన్ మొదటి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్​స్టోన్ మొదట లెదర్ బ్యాగ్​లో పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలా ఆయనతో మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటిష్​ సంప్రదాయాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన వాళ్లూ కొనసాగిస్తూ వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తి ఈ లెదర్​ సూట్​కేసులో ఉంటుంది. అందుకే.. మంత్రి చేతిలో ఉండే ఈ సూట్​కేసును ప్రత్యేకంగా పరిగణిస్తారు. అయితే.. ఆ బ్రీఫ్​కేసును తెచ్చే సంప్రదాయం మారకపోయినా.. దాని రంగులు మాత్రం మారుతూ వచ్చాయి.

ఈ సూట్​కేసులను ఆర్థిక మంత్రిత్వ శాఖనే సేకరిస్తోంది. విభిన్న రంగుల్లోని నాలుగు బ్యాగ్​లను ఆర్థిక మంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

నలుపు నుంచి..

భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్​కే శన్ముఖమ్​ చెట్టీ 1947లో లెదర్​ బ్యాగ్​ వినియోగించారు.

1956-58, 1964-66 సమయంలో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్​ బ్యాగ్​తో పార్లమెంటులో అడుగుపెట్టారు.

1958లో జవహర్​లాల్​ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్​కేసు వాడారు.

1970ల తర్వాతే..

  • ఆర్థిక మంత్రి యశ్వంత్​ సిన్హా.. ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్​ బాక్స్​తో వచ్చారు.
  • మన్మోహన్​ సింగ్​.. బ్రిటన్​ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్​ గ్లాడ్​స్టోన్ వినియోగించిన బ్రీఫ్​కేస్​ను పోలిన నలుపు రంగు బ్యాగ్​ వాడారు.
  • ప్రణబ్​ ముఖర్జీ అందరిలా కాకుండా.. చెర్రీ ఎరుపు రంగు సూట్​కేసులో బడ్జెట్​ పత్రాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా నిలిచారు.
  • బ్రిటన్​ మాజీ ప్రధాని గ్లాడ్​స్టోన్​ తరహాలో.. సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్​కేసుల్ని వినియోగించారు చిదంబరం.
  • మోదీ-1 హయాంలో.. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్​లు వాడారు.
  • 2017లో ముదురు గోధుమ రంగు బ్యాగ్​ వాడారు. 2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్​కేసుతో పార్లమెంట్​లోకి అడుగుపెట్టారు.

ఇదీ చూడండి: దేశ ఆర్థికానికి అంకురాలే ఆశాకిరణాలు

Last Updated : Feb 1, 2021, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.