దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు డెంగ్యూ సోకినట్లు తెలిపారు వైద్యులు. సెప్టెంబర్ 14నే కరోనా బారినపడిన ఆయన.. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో దిల్లీ లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో బుధవారం చేరారు. ఆయనలో ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని వెల్లడించారు డాక్టర్లు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. కొద్దిరోజుల్లో మరోసారి కరోనా పరీక్ష చేయనున్నట్లు తెలిపారు.