డా. సతీష్, సునీత ఆయిల్యంలకు జన్మించింది సుచేత. బాల్యం నుంచే సంగీతమంటే మహా మమకారం. పరభాష పాటలంటే మరీ ఇష్టం. భాష తెలీకపోయినా భావాలను అర్థం చేసుకుంటూ పాటలు విని పాడుతూండేది. అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడైంది. మొదట్లో జపాన్ భాషలో పాడడం ప్రారంభించిన ఆమె ప్రస్తుతం 26 భారతీయ భాషలు, 76 ప్రాశ్చాత్య భాషల్లో పాడుతోంది.
రెండేళ్ల క్రితం దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ హాల్లో మొదటి సారిగా ఆరు గంటల్లో 102 భాషల్లో పాటలు పాడి ప్రంపంచ రికార్డ్ నెలకొల్పింది. మరో సారి 112 భాషల్లో పాటలు పాడి ఇంకో రికార్డు కైవసం చేసుకుంది. ప్రస్తుతం 116 ప్రపంచ భాషల్లో పాటలు పాడుతోంది ఈ గాయని.
పాటలే కాక మానవత్వాన్ని చిన్నప్పటి నుంచే అలవరచుకుంది సుచేత. కృషి, పట్టుదల ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించింది.
"మన ప్రధాని మోదీ దుబాయ్‌కు వచ్చినప్పుడు వేదికపై పాడే అవకాశం వచ్చింది. నేను సొంతంగా ఆల్బమ్ చేసి సంపాదించిన 5 లక్షల రూపాయలు కేరళ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాను. ఇవి రెండు నా జీవితంలో మరచిపోలేని క్షణాలు. నాకు మూడు సంవత్సరాలున్నప్పుడు పాడడం మొదలు పెట్టాను. ఇప్పుడు 116 భాషల్లో పాడగలను."
-సుచేత సతీష్, గాయని
ఇదీ చూడండి:'ఆవు-ఆక్సిజన్'పై సీఎం కథ విన్నారా..?