ETV Bharat / bharat

రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు - uddhav thackeray news

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. భూమిపూజ సందర్భంగా గర్భగుడి లోపల ఐదు వెండి ఇటుకలను అమర్చనున్నారు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మోదీతో పాటు పలువురు ప్రముఖలు పాల్గొననున్నట్లు సమాచారం.

Silver bricks invite to Uddhav grand structure stage set for mega Bhumi Pujan for Ram Mandir
రామమందిరం భూమిపూజలో వెండి ఇటుకలు
author img

By

Published : Jul 20, 2020, 10:47 PM IST

అయోధ్యలో రామమందిరం భూమిపూజకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామమందిరం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మహేష్‌ భగవత్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌కు కూడా రామమందిరం పూజారులు ఆహ్వానం పంపారు. దాదాపు 300 మందికి ఆహ్వానాలు పంపనున్నట్లు తెలుస్తోంది.

రామమందిరం నిర్మాణం ప్రారంభం సందర్భంగా ఆగస్టు 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించేందుకు పూజారులు నిర్ణయించారు. 4న రామాచార్య పూజ, 5వ తేదీ 12.15 గంటలకు భూమిపూజ జరుపనున్నారు. రామమందిరంతోపాటు అయోధ్యలో ప్రధాని మోదీ మొదటి పర్యటన ఇదే కానుంది. భూమిపూజ సందర్భంగా గర్భగుడి లోపల ఐదు వెండి ఇటుకలను అమర్చనున్నారు. ఇందులో మొదటి ఇటుకను ప్రధాని అమర్చనున్నారు. హిందూ పురాణాల ప్రకారం ఐదు ఇటుకలు ఐదు గ్రహాలకు ప్రతీక.

వీహెచ్‌పీ ప్రతిపాదన ప్రకారమే..

విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతిపాదించిన మాదిరిగానే ఆలయ రూపకల్పనతోపాటు నిర్మాణం ఉండనుంది. అయితే మునుపటి డిజైన్‌తో పోలిస్తే గుడి పొడవు, వెడల్పుతోపాటు ఎత్తును పెంచనున్నారు. గతంలో ప్రతిపాదించిన 38 వేల చదరపు అడుగుల వైశాల్యానికి బదులు 76 వేల నుంచి 84 వేల చదరపు అడుగుల మధ్య నిర్మించనున్నారు.

ఠాక్రేకు ఆహ్వానం..

శివసేనకు రామమందిరం ఉద్యమంతో దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. అందుకే భూమిపూజకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మందిరం కూల్చివేత కేసులో మొదట ఉద్దవ్ తండ్రి బాలసాహెబ్ ఠాక్రే పేరు చేర్చారు. కానీ బాల్‌ ఠాక్రే మరణం అనంతరం అతడి పేరును తొలగించారు. ఈ ఏడాది మార్చిలో ఉద్ధవ్‌ అయోధ్యలో పర్యటించి రామమందిరం నిర్మాణాలనికి రూ.కోటి విరాళం ప్రకటించారు. భాజపాతో సంబంధాలు తెంచుకున్నప్పటికీ తన పార్టీ శివసేన హిందుత్వానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి: 'దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.