ETV Bharat / bharat

వాతావరణ మార్పుల చట్టానికి 'ఇండియన్​ థన్​బర్గ్'​ పోరాటం

author img

By

Published : Oct 19, 2020, 5:05 PM IST

వాతావరణ మార్పులపై అవగాహన పెంచుతూ.. కాలుష్య నివారణకు పోరాట పథంలో సాగుతోంది ఓ చిన్నారి. తొమిదేళ్ల వయస్సులోనే పర్యావరణ కార్యకర్తగా కాలుష్య రహిత సమాజం కోసం కంకణం కట్టుకుంది మణిపూర్​కు చెందిన లిసీప్రియా. గ్రెటా థన్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుతెచ్చుకున్న ఈ చిన్నారి.. పర్యావరణ కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు.. కేంద్ర ప్రభుత్వం వాతావరణ మార్పుల చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తోంది.

licypriya environment activist
లిసీప్రియా
వాతావరణ మార్పుల చట్టానికి 'ఇండియన్​ థన్​బర్గ్'​ పోరాటం

వాతావరణ కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం కావాలనే నినాదంతో కూడిన ప్లకార్డును పట్టుకున్న ఈ చిన్నారి పేరు లిసీప్రియా కంగుజం. మణిపూర్ కు చెందిన ఈ బాలిక వయస్సు తొమ్మిదేళ్లు. అతిచిన్న వయస్సులోనే పర్యావరణ కార్యకర్తగా అవగాహన కార్యక్రమాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు ఇచ్చి ఔరా అనిపిస్తోంది ఈ చిన్నారి.

licypriya environment activist
లిసీప్రియా

దిల్లీ ఉక్కిరి బిక్కిరి..

శీతాకాలం వచ్చిందంటే దిల్లీ సహా ఉత్తరభారతంలో కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతుండటం వల్ల నివారణకు చర్యలు చేపట్టాలంటూ పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ లో ధర్నాకు దిగింది లిసీప్రియా. ఈ నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు తన నిరసన తెలియజేసింది. దిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని.. నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

పర్యావరణ కాలుష్యాన్ని అంతమొందించేందుకు శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలంటే వాతావరణ మార్పుల చట్టం తీసుకురావాలని చిన్నారి పర్యావరణ వేత్త లిసీప్రియా డిమాండ్ చేస్తోంది. ప్రజాప్రతినిధులు తన డిమాండ్​కు స్పందించాలంటూ ఆదివారం మరోసారి పార్లమెంట్ సమీపంలో నిరసన తెలియజేసిన లిసీప్రియాను పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టారు.

licypriya environment activist
పార్లమెంట్​ ఎదుట నిరసన తెలుపుతున్న లిసీప్రియా

పార్లమెంట్​లో వాతావరణ మార్పుల బిల్లును ఆమోదించే వరకు తన ఉద్యమం కొనసాగుతుందని తెలిపింది లిసీప్రియా. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వాతావరణ మార్పుల పేరుతో పాఠ్యాంశాన్ని బోధనాంశాల్లో చేర్చాలని.. తనలాంటి చిన్నారులు అమ్మలాంటి ప్రకృతిని కాపాడుకునేలా ప్రోత్సహించాలని కోరుతోంది.

క " పగటి పూట ఎంత చెప్పినా మన నాయకులు పట్టించుకోవటం లేదనే కారణంగానే రాత్రి ఇక్కడకి వచ్చి నిరసన చేస్తున్నా. గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు నేతలు వెంటనే చర్యలు తీసుకోవాలి. దిల్లీనే తీసుకుంటే వాయుకాలుష్యం ఎంత ప్రమాదకరంగా మారిందో తెలుస్తుంది. దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుక్కోవటానికి బదులుగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటంలో మన నేతలు బిజీగా ఉన్నారు. మాటలు చెప్పటమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ప్రపంచ నేతలు సత్వరం చర్యలు తీసుకోకుంటే భూమండలం నాశనమవుతుంది."

- లిసీప్రియా కంగుజం, పర్యావరణ కార్యకర్త

దేశ రాజధాని దిల్లీలో కాలుష్య నివారణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసి లిసీప్రీయా కోరింది. గాలి కాలుష్యం కారణంగా ఏటా 60 లక్షలమంది చిన్నారులు చనిపోతున్నారని.. స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కు తమకుందంటూ లిసీప్రియా నినదిస్తోంది. దిల్లీ కాలుష్యానికి కారణమైన పంటవ్యర్థాల దహనంలో పేద రైతులను తప్పుపట్టలేమని.. ప్రభుత్వాలే చొరవ తీసుకొని వారికి సహాయంతో పాటు అవగాహన కల్పించాలని ఆ చిన్నారి కోరుతోంది.

తనదైన శైలిలో సమాధానం..

గతేడాది కూడా లిసీప్రియా వాతావరణ మార్పు చట్టం కోసం పార్లమెంట్ ఎదుట పోరాటం చేసింది చిన్నారి పర్యావరణ వేత్త లిసీప్రియా. అంతేకాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లిసీని ప్రధాని మోదీ ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తే.. రాజకీయ ప్రయోజనాల కోసం తనను ఉపయోగించుకోవద్దని కోరుతూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దానిపై స్పందించిన కాంగ్రెస్ ను సైతం ప్రతిపక్షంగా పర్యావరణం కోసం మీరేం చేయబోతున్నారంటూ ప్రశ్నించింది.

చిన్న వయస్సులోనే చిచ్చర పిడుగులా దూసుకుపోతూ.. గతేడాది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన వాతావరణ సదస్సు -కాప్ 25 లో ప్రసంగించి అందరి దృష్టిని ఆకర్షించింది లిసీప్రియా. వరల్డ్ చిల్డ్రెన్స్ పీస్ ప్రైజ్, ద ఇండియా పీస్ ప్రైజ్ సహా 2019 అబ్దుల్ కలాం చిల్డ్రెన్ అవార్డును లిసీప్రియా దక్కించుకుంది. వయసు చిన్నదే అయినా ఆలోచనలకు మాత్రం పెద్దవారిని మించినట్లు పలువురు మేథావులు ప్రశంసిస్తున్నారు.

licypriya environment activist
లిసీప్రియా
licypriya environment activist
అవార్డు అందుకుంటోన్న లిసీప్రియా

ఇదీ చూడండి: కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్- నెటిజన్ల ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.