భారత్‌లో స్పుత్నిక్-వీ మూడో దశ ట్రయల్స్ నిర్వహణతో పాటు వ్యాక్సిన్‌ను తయారు చేయాలన్న రష్యా ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై జరిగిన చర్చల్లో కీలక పురోగతి సాధించినట్టు.. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడుతాయని పేర్కొన్నారు.
భారత్‌తో ప్రత్యేక బంధం ఉన్న రష్యా నుంచి ఈ ప్రతిపాదన రావడం వల్ల.. ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు నీతి ఆయోగ్(ఆరోగ్య) సభ్యుడు డా. వీకే పాల్ తెలిపారు. స్పుత్నిక్‌పై బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించారని, మూడో దశ ట్రయల్స్ జరపాల్సిన అవసరముందని వారు గుర్తించినట్టు పేర్కొన్నారు. భారత్‌లోని అనేక సంస్థలు కూడా రష్యా ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
ఒక వేళ రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తే.. దేశానికి, ప్రపంచానికి మేలు జరుగుతుందని పాల్ అభిప్రాయపడ్డారు.
తొలి టీకా...
ఆర్డీఐఎఫ్, గమలేయా ఔషధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వీ'ని ఆగస్టు 11న విడుదల చేసింది రష్యా. ప్రపంచంలో విడుదలైన తొలి టీకాగా గుర్తింపు పొందింది. ఈ టీకా మంచి ఫలితాలు ఇస్తోందని 'ది లాన్సెట్' జర్నల్ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌పై ఆశలు రేకెత్తుతున్నాయి.
ఇదీ చూడండి:- ప్రజా పంపిణీకి రష్యా వ్యాక్సిన్- తొలిబ్యాచ్ విడుదల